తెలంగాణ

జనమంటే మీకు ఆటలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 27: ‘ప్రజలంటే మీకు ఆటలా? రోజుకో మాట మాట్లాడుతున్నారు? చేతులు కట్టుకుని ఉన్నామని అనుకోవద్దు’ అని తెలుగుదేశం, బిజెపిలను జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ హెచ్చరించారు. శుక్రవారం ఇక్కడ ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ స్వర్ణ్భారతి ట్రస్టుపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చూపించిన శ్రద్ధ ఆంధ్రప్రదేశ్‌పై చూపించి ఉంటే ఈపాటికి ప్రత్యేక హోదా వచ్చేదని అన్నారు. కేంద్ర మంత్రులు, టిడిపి నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఇక ఎంత మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు. రామాలయం గురించి మాట్లాడుతున్న నేతలకు ప్రత్యేక హోదా అంశం కనిపించదా అని నిలదీశారు. చంద్రబాబునాయుడు చేస్తున్నది నైతిక తప్పు అని పేర్కొంటూ నోట్ల రద్దుపై చంద్రబాబు రోజుకో మాట మాట్లాడారని అన్నారు. చంద్రబాబునాయుడు కేంద్ర ప్రభుత్వంతో ఎందుకు కాంప్రమైజ్ అయ్యారో తేల్చిచెప్పాలని పవన్‌కల్యాణ్ డిమాండ్ చేశారు. ప్రజాసమస్యలపై పార్టీలు అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజిస్తున్న సమయంలో జరిగిన ఎన్నికల్లో తాను బిజెపి, తెదేపాలకు మద్దతు పలికితే ఆ పార్టీలు కూడా అదే పనిచేస్తున్నాయని మండిపడ్డారు. గుజరాత్ అభివృద్ధి చూసి నరేంద్రమోదీకి, పరిపాలనా దక్షత చూసి చంద్రబాబుకు మద్దతు పలికానని, మంచి జరుగుతుందన్న ఉద్దేశంతోనే ప్రచారం చేశానని అన్నారు. వారికి మద్దతుగా ప్రచారం చేసినపుడు రాజకీయాలు తెలుసా, అనుభవం ఉందా అని తనను ఎవరూ అడగలేదని, బిజెపి నేతలు తనతో కర్నాటక, తమిళనాడులో కూడా ప్రచారం చేయించుకున్నారని, ఇపుడు ప్రజాసమస్యలపై ప్రశ్నిస్తే నీకు రాజకీయాలు ఏం తెలుసు అంటూ ప్రశ్నిస్తున్నారని అన్నారు. దీనికంటే అవకాశవాదం ఎక్కడైనా ఉంటుందా అని పవన్ కల్యాణ్ నిలదీశారు. మోదీ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం పరిఢ విల్లుతుందని అనుకున్నానని, కానీ ఆయన అన్ని విషయాల్లో ఒంటెద్దు పోకడకు పోతున్నారని అన్నారు. రోహిత్ వేముల, పుణె ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ వివాదం, నోట్ల రద్దు అంశాల్లో మోదీ ఒంటెద్దు పోకడకు పోయారని అన్నారు. ప్రధాని తీరు నియంతృత్వ ప్రజాస్వామ్యం కిందకు వస్తుందని పేర్కొన్నారు.
తమిళనాడులో జల్లికట్టు వివాదానికి కారణం బిజెపియేనని పవన్ కల్యాణ్ ఆరోపించారు. జయలలిత మరణం తర్వాత తమిళనాడు రాజకీయాలను శాసించాలని భాజపా ప్రయత్నిస్తోందని, దీనిని పసిగట్టిన యువత ఆ పార్టీకి బుద్ధి చెప్పడానికే ఉద్యమబాట పట్టిందని అన్నారు. జల్లికట్టు ఉద్యమం కేవలం సంస్కృతి పరిరక్షణ ఉద్యమం మాత్రమే కాదని వివరించారు.
మాటమార్చిన వెంకయ్య
ఎపికి ప్రత్యేక హోదా పదేళ్లు కావాలని పార్లమెంటులో డిమాండ్ చేసిన వెంకయ్య, అధికారంలోకి రాగానే అదేమీ సంజీవని కాదని వ్యాఖ్యానించడం దారుణమని అన్నారు. ఆయన రోజుకో మాట మాట్లాడుతుంటే ప్రజలు ఊరుకోరని, వెంకయ్య నిలకడ లేని మాటలను నమ్మే స్థితిలో ప్రజలు లేరని అన్నారు. ప్రత్యేక హోదా తెలుగు ప్రజల హక్కు అని చెప్పారు. ‘దానిని ప్రసాదించడానికి మీరేమైనా దేవుళ్లా లేక పైనుండి దిగొచ్చారా? మేమంతా మీకు బానిసలమా? రామ మందిరం గురించి పట్టించుకుంటారు. 4కోట్ల ప్రజల సమస్యలు మాత్రం పట్టవా అని నిలదీశారు. చంద్రబాబు ప్రత్యేక హోదా అంశంలో ఎందుకు వెనుకడుగు వేశారో అర్థం కావడం లేదన్నారు. రుణాలు ఎగ్గొట్టిన సుజనా చౌదరి లాంటి వ్యక్తిని వెంటబెట్టుకుని తిరుగుతుండటం సిగ్గుచేటని చంద్రబాబుపై మండిపడ్డారు.