తెలంగాణ

కొత్త కొత్తగా... ఆసక్తిగా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగర పాలక సంస్థ రెండో పాలక మండలి మొట్టమొదటి సమావేశం మంగళవారం ఆసక్తికరంగా సాగింది. మజ్లిస్ సభ్యులు సమావేశంలో టిఆర్‌ఎస్ సభ్యులపై ఆధిపత్యం సాధించేందుకు విఫలయత్నం చేశారు. అనంతరం ప్రారంభమైన ప్రశ్నోత్తరాల పర్వంలో చెత్త తరలించే ఆటో టిప్పర్ల కేటాయింపు, వందరోజుల కార్యచరణ ప్రణాళిక, డోర్ టు డోర్ నుంచి ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌కు చెత్త తరలింపు వంటి అంశాలపైనే వాడివేడి చర్చ జరిగింది. మజ్లిస్ సభ్యుడు మాజీద్ హుస్సేన్ లేచి తాను సమర్పించిన వంద రోజుల యాక్షన్ ప్లాన్, సమ్మర్ యాక్షన్ ప్లాన్ అంశాలను ప్రస్తావించారు. కొత్తగా గెలిచిన కార్పొరేటర్ల అభిప్రాయాలను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండానే వంద రోజుల యాక్షన్ ప్లాన్, సమ్మర్ కార్యాచరణను ఎలా రూపొందించారంటూ ప్రశ్నించారు. దీంతో టిఆర్‌ఎస్ సభ్యులు మిత్ర కృష్ణ, బంగారిప్రకాశ్ జోక్యం చేసుకోవటంతో మజ్లిస్ సభ్యులు కూడా కలగజేసుకోవటంతో వారి మధ్య వాదనలు చోటుచేసుకున్నాయి. ఇరు పార్టీలకు చెందిన సభ్యులు మేయర్ పోడియం వద్దకు చేరుకుని ప్రశ్నించారు. మజ్లిస్ ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ కూడా పొడియం వద్దకు చేరుకోగానే టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు ప్రభాకర్‌రావు, సుధాకర్‌రెడ్డి కూడా అక్కడకు చేరుకుని మజ్లిస్ సభ్యులతో వాదనకు దిగారు. కార్పొరేటర్లకు రూ. 5 కోట్ల వార్షిక బడ్జెట్‌ను మంజూరు చేయాలని, ఇందుకు ఇపుడే తీర్మానం చేయాలని మాజీద్ హుస్సేన్ పట్టుబట్టడంతో మేయర్ జోక్యం చేసుకుని ఈ విషయంపై తమ తర్వాత తన ఛాంబర్‌లో చర్చిద్దామని చెప్పినా, ఆయన విన్పించుకోలేదు. అలాగే శానిటేషన్‌పై సుదీర్ఘ చర్చ జరుగుతుండగానే మధ్యాహ్నం రెండు గంటలకు కౌన్సిల్ సమావేశం ముగిసినట్లు మేయర్ రామ్మోహన్ ప్రకటించారు.
తొలుత తడబడినా...
తెలంగాణ ఉద్యమకారుడైన బొంతు రామ్మోహన్ మొట్టమొదటి సారిగా మేయర్ హోదాలో కౌన్సిల్ నిర్వహించారు. హైదరాబాద్ వాడుక బాష అయిన ఉర్దూ బాగా రాకపోయినా, ఆయన మాజిద్ హుస్సేన్‌తో ఉర్దూలోనే సంభాషించారు. తొలి పది, పదిహేను నిమిషాల పాటు మేయర్ ఉర్దూలో మాట్లాడేందుకు తడబడినా ఆ తర్వాత సమావేశాన్ని సమర్థవంతంగానే నిర్వహించారు. ఇక కార్పొరేటర్ల విషయాని కొస్తే టిఆర్‌ఎస్ కార్పొరేటర్ స్వర్ణరాజ్, కాంగ్రెస్ కార్పొరేటర్ సాయిజెన్ శాంతి, మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి కోడలు తీగల సునరిత రెడ్డి, స్వర్ణలతారెడ్డి, టిఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మీ, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్‌రెడ్డి తొలి సమావేశంలోనే చాలా చక్కగా మాట్లాడుతూ సమస్యలను ఏకరవు పెట్టారు.