తెలంగాణ

ఏసిబి వలలో ‘తిమింగలం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జనవరి 27: నల్లగొండ జిల్లాలో మరో అవినీతి తిమింగలం ఎసిబి వలకు చిక్కింది. ఆర్‌డబ్ల్యుఎస్ శాఖ ఎస్‌ఈ బి.రమణనాయక్ చెప్పడంతో సూపరిండెంట్ లక్ష్మారెడ్డి శుక్రవారం ఎస్‌ఈ కార్యాలయంలో కాంట్రాక్టర్ వివేకానందరెడ్డి నుండి రూ. 6 లక్షల రూపాయలు లంచం సొమ్ము తీసుకుంటు ఎసిబి అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు. కృష్ణా పుష్కరాల్లో మంచినీటి ఆర్‌వో ఫ్లాంట్‌ల ఏర్పాటుకు సంబంధించి 39 పనులను కాంట్రాక్టర్ వివేకానందరెడ్డి పూర్తి చేశారు. వీటిలో 30 పనులకు గతంలో బిల్లుల చెల్లింపు జరుగగా మిగిలిన 9 పనులకు సంబంధించిన బిల్లులు చెల్లింపు జరగాల్సి ఉంది. గతంలో చెల్లించిన బిల్లులకు, పెండింగ్ బిల్లుల చెల్లింపునకుగాను రూ.18 లక్షల లంచం ఇవ్వాలంటు ఎస్‌ఈ రమణనాయక్ నార్కట్‌పల్లికి చెందిన బి-క్లాస్ కాంట్రాక్టర్ వివేకానందరెడ్డిని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై వివేకానంద రెడ్డి ఏసిబిని ఆశ్రయించారు. పథకం మేరకు వివేకానందరెడ్డి 6 లక్షల లంచం సొమ్మును ఎస్‌ఈ రమణనాయక్‌కు ఇచ్చేందుకు శుక్రవారం ఆర్‌డబ్ల్యుఎస్ కార్యాలయానికి వెళ్లారు. ఈ సమయంలో ఎస్‌ఈ హైద్రాబాద్‌లో ఉండగా తనకు ఇవ్వాల్సిన లంచం సొమ్మును కార్యాలయ సూపరింటిండెంట్ లక్ష్మారెడ్డికి ఇవ్వాలని సూచించారు. దీంతో వివేకానందరెడ్డి రూ. 6 లక్షల లంచం సొమ్మును ఎస్‌ఈ కార్యాలయంలోనే సూపరింటెండెంట్ లక్ష్మారెడ్డికి ఇవ్వగానే పొంచి వున్న ఎసిబి డిఎస్పీ కోటేశ్వర్‌రావు నేతృత్వంలోని బృందం వెంటనే దాడి చేసి లంచం సొమ్ముతో సహా లక్ష్మారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే సెల్‌ఫోన్ సిగ్నల్స్ ద్వారా హైద్రాబాద్‌లో ఉన్న ఎస్‌ఈ రమణనాయక్‌ను సైతం ఎసిబి హెడ్‌క్వార్టర్స్ బృందం అరెస్టు చేసింది. డిఎస్పీ కోటేశ్వర్ రావు దాడి వివరాలను వెల్లడిస్తు ఈ దాడిలో ఎసిబి నల్లగొండ సిఐ జగన్‌మోహన్ రెడ్డి, మహబూబ్‌నగర్ డిఎస్పీ ప్రభాకర్, సిఐలు సుదర్శన్, రవిందర్ రెడ్డి, హైద్రాబాద్ ఎసిబి డిఎస్పీ గౌస్, సిఐలు వెంకటేశం, మజిద్‌లు పాల్గొన్నారని తెలిపారు. అరెస్టు చేసిన లక్ష్మారెడ్డి, రమణనాయక్‌లను ఎసిబి కోర్టుకు తరలిస్తున్నామని, ఎస్‌ఈ కార్యాలయంతో పాటు రమణనాయక్ ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇటీవలే జిల్లా విజిలెన్స్ ఎస్పీ భాస్కర్‌రావు రైస్‌మిల్లర్ల నుండి లక్ష రూపాయలు లంచం సొమ్ము తీసుకుంటు ఎసిబికి చిక్కిన క్రమంలో మరో జిల్లా అధికారి ఎసిబికి చిక్కడం విశేషం.

చిత్రం..లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు పట్టుబడిన లక్ష్మారెడ్డి