తెలంగాణ

వెల్లివిరిసిన సామరస్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేరేడుచర్ల, జనవరి 27: లౌకికత్వానికి, మత సామరస్యానికి చిహ్నమైన జాన్‌పహాడ్ జాతరకు అటు ముస్లింలు, ఇటు హిందువులు పెద్దసంఖ్యలో తరలిరావడంతో దర్గా కిటకిటలాడింది. పాలకీడు మండలంలోని జాన్‌పహాడ్‌లో అట్టహాసంగా ఉర్సు ఉత్సవాలు జరుగుతున్నాయి. మహోత్సవం రెండవ రోజు శుక్రవారం అశేష జనవాహిని మధ్య అత్యంత వైభవంగా, కన్నులపండువగా, సాంప్రదాయసిద్ధంగా జరిగింది. ముస్లింల వేడుకే అయిన ఉర్సు ఉత్సవంలో అధికశాతం హిందువులు రావడంతో మతసామరస్యం వెల్లివిరిసింది. తెలంగాణ జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఒంగోలు తదితర జిల్లాల నుండి భక్తులు తరలిరావడంతో దర్గా పరిసర ప్రాంతం మొత్తం జనసంద్రమైంది. రాష్ట్ర విద్యత్‌శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీలు పూల రవీందర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కలెక్టర్ సురేంద్రమోహన్, జాయింట్ కలెక్టర్ సురేందర్ రెడ్డి, ఎస్‌పి పరిమళ, ఆర్డీఓ మోహన్‌రావు, డిఎస్‌పి రమణారెడ్డి తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు హైద్రాబాద్ నుండి వక్ఫ్‌బోర్డు తెచ్చిన గంధం చందల్‌ఖానాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మతపెద్దలు, రాజకీయ నాయకులు, భక్తులు గురువారం రాత్రి దర్గా వద్దకు చేరుకుని గంధం ఊరేగింపులో పాల్గొన్నారు. చందల్‌ఖానా నుండి జాన్‌పహాడ్, కల్మెటతండా గ్రామాల్లో వీదివీదిన గట్టి పోలీసు బందోబస్తు మధ్య ఊరేగింపు నిర్వహించారు. పవిత్ర కలశంలో ఉన్న గంధాన్ని తాకితే పుణ్యం వస్తుందని, సంతానం కలుగుతుందని, అనారోగ్యం పోతుందని, కోరిన కోర్కెలు తీరుతాయని, అదృష్టం కలిసి వస్తుందని ఊరేగింపులో గంధాన్ని తాకడానికి విశ్వప్రయత్నం చేశారు. భక్తులు పవిత్ర స్నానం చేసి తడిబట్టలతో దర్గా చుట్టు ‘పానసరం’ పట్టారు. దర్గా వద్ద ఉన్న నాగేంద్ర పుట్ట వద్ద పూజలు చేశారు. సుమారు 4కి.మీ దూరం నుండి ఊరేగింపుగా దర్గా వద్దకు గంధం తీసుకొచ్చి దర్గాలోని అజ్రత్ సయ్యద్ మొహినొద్దిన్‌షా, జాన్‌పహాడ్ సయ్యద్ రహమతుల్లా సమాదులపై గంధం ఎక్కించే సమయంలో తీవ్రమైన తొక్కిసలాట జరిగింది. పోలీసులు సకాలంలో స్పందించి అదుపుచేశారు. డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ భక్తులకు తాగునీరు సరఫరా చేశారు. పాలకీడు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పులిహోర పంపిణి చేశారు. మిర్యాలగూడ, కోదాడ ఆర్టీసి డిపోలు నేరేడుచర్ల, దామరచర్ల మీదుగా ఆర్టీసి బస్సులను నిర్వహించారు. వక్ఫ్‌బోర్డు సౌకర్యాలు కల్పించకపోవడంతో పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు.