తెలంగాణ

‘అమృత్’ కింద రూ.700 కోట్లివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 27: కేంద్ర బడ్జెట్ మరో మూడురోజుల్లో వస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రతిష్ఠాకరంగా అమలు చేస్తున్న అమృత్ స్కీం కింద వచ్చే ఆర్ధిక సంవత్సరంలో రూ.700 కోట్లను విడుదల చేసే విధంగా రాష్ట్రప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. అటల్ మిషన్ ఫర్ రిజునివేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్ (అమృత్) కింద కేంద్రం తెలంగాణ రాష్ట్రంలో రెండేళ్ల క్రితమే పది పట్టణాలను ఎంపిక చేసింది. ఈ స్కీం కింద నగరంలో పార్కుల అభివృద్ధి, మంచినీటి పథకాల అమలు, మురికి నీటి వ్యవస్థ ఏర్పాటు తదితర కార్యక్రమాల అమలుకు నిధులను కేంద్రం విడుదల చేస్తుంది. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం రెండేళ్లలో రూ.960 కోట్లను విడుదల చేసింది. వర్తమాన ఆర్థిక సంవత్సరంలో మంజూరు చేసిన నిధులు రూ. 408.51 కోట్లు ఇందులో ఉన్నాయి. తెలంగాణలో రామగుండం, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, వరంగల్, సూర్యాపేట, మిర్యాలగూడ, నల్లగొండ, నిజామాబాద్‌ను కేంద్రం ఈ పథకం కింద ఎంపిక చేసింది. ఈ పట్టణాల్లో సగటున రోజుకు 135 లీటర్ల కంటే తక్కువగా ప్రతి వ్యక్తి నీటి వినియోగం ఉంది. కేంద్రం అమృత్ స్కీం కింద పట్టణాలను ఎంపిక చేసేందుకు 135 ఎల్‌పిసిడిని కొలమానంగా తీసుకుంది. ఎంపిక చేసిన పట్టణాల్లో అన్ని ఇళ్లకు మంచినీటి కనెక్షన్లు ఇవ్వాలి. వీటితో పాటు అర్బన్ రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయాలి. దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన 500 పట్టణాల్లో వౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు కేంద్రం అమృత్ స్కీంను అమలు చేస్తోంది.