తెలంగాణ

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఓరుగల్లు గెలిచేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జనవరి 27: జాతీయ స్థాయిలో జరుగుతున్న స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీలో చారిత్రక వరంగల్ నగరానికి ఈసారైనా మొదటి పదిస్థానాల్లో చోటు దక్కుతుందా అని ఇటు ప్రజాప్రతినిధులు, అటు నగరపాలక సంస్థ అధికారులు ఆశతో ఎదురుచూస్తున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితులు గమనిస్తుంటే స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో పోటీ తీవ్రంగా ఉండటం, సర్వేలో స్థానం దక్కించుకునేందుకు నగరపాలక సంస్థ చేపట్టిన ముందస్తు చర్యలు తుతు మంత్రంగా జరగటంతో ఫలితం కష్టమని వివిధ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ సర్వేలో లభించిన ర్యాంకు ఆధారంగా కేంద్రప్రభుత్వం వివిధ పథకాల కింద నగరపాలక సంస్థలకు నిధులు కేటాయించేందుకు అవకాశం ఉండటంతో మెరుగైన ర్యాంకు కోసం దేశంలోని పలు నగరాలు పోటీ పడుతున్నాయి. స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో భాగంగా వరంగల్ నగరపాలక సంస్థ చేపట్టిన పారిశుద్ధ్యం, పరిశుభ్రతపై, మరుగుదొడ్ల నిర్వహణ తదితర అంశాలపై స్వచ్ఛ్భారత్ మిషన్‌కు చెందిన ముగ్గురు సభ్యుల బృందం శుక్రవారం నుంచి సర్వే ప్రారంభించింది. ఈ బృందంలో ఇద్దరు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు, ఒకరు రాష్ట్రప్రభుత్వ ప్రతినిధి ఉన్నారు. పారిశుద్ధ్యంపై నగరపాలక సంస్థ పెట్టిన శ్రద్ధ ఏమిటో శుక్రవారం నుంచి మూడురోజుల పాటు ఈ బృందం నిర్వహించే సర్వేతో తెలిపోతుంది. గత ఏడాది స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో దేశంలోని 70 నగరపాలక సంస్థలు పోటీపడగా వరంగల్‌కు 37వ స్థానం దక్కింది. కానీ ఈసారి ఐదువందల నగరాలు పోటీ పడుతుండటంతో పోటీ తీవ్రంగా మారే పరిస్థితులు కనపడుతున్నాయి. స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో ర్యాంకు కోసం పోటీపడటంలో కనబరచిన శ్రద్ధ ర్యాంకు సాధించేందుకు తీసుకోవలసిన ముందుజాగ్రత్తలపై నగరపాలక సంస్థ పట్టించుకోలేదు.
స్వచ్ఛ సర్వేక్షన్ సర్వేలో మూడు కేటగిరిలలో పోటీలో పాల్గొన్న నగరాలకు మార్కులు వేస్తారు. మొత్తం రెండువేల మార్కులు ఉండగా పారిశుధ్య కార్యక్రమాలపై నగరపాలక సంస్థ అందించే డాక్యుమెంటేషన్ల ఆధారంగా తొమ్మిది వందల మార్కులు వేస్తారు. ప్రజల నుంచి వచ్చే సమాచారం ఆధారంగా ఆరువందల మార్కులు, క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య కార్యక్రమాలు అమలుపై బృందం పరిశీలన ఆధారంగా ఐదువందల మార్కులు వేస్తారు. వరంగల్ నగరపాలక సంస్థ విషయానికి వస్తే డాక్యుమెంటేషన్ విభాగంలో వచ్చే మార్కులపైనే నగరపాలక సంస్థ ప్రధానంగా ఆశలు పెట్టుకుంది. ప్రజల నుంచి వచ్చే సమాచారం విషయంలో ముందునుంచి నగరపాలక సంస్థ జాగ్రత్తలు తీసుకోకపోవటంతో ప్రత్యేకంగా రూపొందించిన యాప్ డౌన్‌లోడ్ జరగకపోవటం, ప్రజల నుంచి సమాచారం నమోదు కాకపోవటంతో ఈ విభాగంలో ఆశించిన మేరకు మార్కులు రావటం కష్టమేనని అధికారులు భావిస్తున్నారు. ఇకపోతే క్షేత్రస్థాయిలో పారిశుధ్య కార్యక్రమంపై నగరపాలక సంస్థ పాలకవర్గం, అధికారులు ఇటీవల కాలంలో కొంత ప్రత్యేకశ్రద్ధ తీసుకుంటున్నా డంపింగ్ యార్డుల నిర్వహణ, తడి, పొడి చెత్త వేరుచేయటం తదితర అంశాలతోపాటు మరుగుదొడ్ల నిర్మాణం, నిర్వహణ అంశాలు ప్రతిబంధకంగా మారే పరిస్థితులు ఉన్నట్లు సమాచారం. మూడురోజుల పాటు జరిగే స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో భాగంగా ముగ్గురు సభ్యుల బృందం జిల్లా యంత్రాంగం, నగరపాలక సంస్థ యంత్రాంగం ప్రమేయం లేకుండా క్షేత్రస్థాయిలో సర్వే జరుపుతున్నారు. ఫలితంగా సర్వేలో వరంగల్ నగరపాలక సంస్థకు ఏ ర్యాంకు దక్కుతుందోనని పాలకవర్గ సభ్యులు, అధికారులు ఆతృతతో ఎదురుచూస్తున్నారు. నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ, ఇళ్ల నుంచి చెత్త సేకరణ, వీధులలో చెత్త తొలగింపు, చెత్తను వేరుచేసే విధానం, మరుగుదొడ్ల నిర్వహణ తదితర అంశాలపై వ్యక్తిగత పరిశీలన ప్రారంభించారు.