తెలంగాణ

పార్టీ పటిష్ఠానికి పనిచేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 28: జాతీయ స్థాయిలో బిజెపిని పటిష్ఠం చేసేందుకు కార్యకర్తలు అంకిత భావంతో పనిచేయాలని, అభివృద్ధి అజెండాగా కార్యకర్తలు ప్రచారం చేయాలని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో తనను కలిసిన నాయకులతో మాట్లాడిన తర్వాత మీడియాతో మాట్లాడారు. దేశంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత విపక్షాలు విద్వేషపూరిత ప్రచారాన్ని చేశాయని, ప్రజల అనుమానాలన్నింటికీ ప్రధాని నేరుగా సమాధానం చెప్పారని ప్రస్తుతం దేశంలో ఆర్థిక సంస్కరణలను ప్రజలు అర్థం చేసుకున్నారని చెప్పారు. రానున్న రోజుల్లో ఆర్థిక లావాదేవీలు అన్నీ జామ్ (జన్‌ధన్-ఆధార్-మొబైల్) ఫ్లాట్ ఫారంపైనే జరుగుతాయని అన్నారు. ప్రజలు ఎవరి చుట్టూ తిరగనక్కర్లేదని, ప్రయోజనాలు నేరుగా ప్రజల ఖాతాల్లోకి వస్తాయని అన్నారు. దేశంలో 26.72 కోట్లు కొత్త బ్యాంకు ఖాతాలు ప్రారంభం అయ్యాయని, 71,557 కోట్లు డిపాజిట్లు ఉన్నాయని చెప్పారు. దాదాపు 1.4 కోట్ల మందికి సబ్సిడీని వెనక్కు ఇవ్వడం జరిగిందని, దీన్ దయాళ్ గ్రామ జ్యోతి యోజన కింద 12,141 గ్రామాలకు విద్యుద్ధీకరణ పూర్తయిందని పేర్కొన్నారు. డిబిటి కింద 59 పథకాలకు 61,822 కోట్లు బదిలీ జరిగిందని అయితే నకిలీ ఖాతాలతో 21,260 కోట్ల రూపాయలు వెనక్కు వచ్చాయని అన్నారు. అటల్ పెన్షన్ యోజన కింద 24.6 లక్షల మందికి లబ్ధి చేకూరుతోందని, జీవన్ జ్యోతి కింద 3.7 కోట్ల మందికి, అంత్యోదయ కింద 367.71 కోట్లు అందించడం జరిగిందని అన్నారు. స్టార్టప్ పథకం అమలుకు 10వేల కోట్లు రిజర్వు చేశారని, సుకన్య సమృద్ధి యోజన పథకం అమలుచేస్తున్నారని, ఎంతో వ్యయ ప్రయాసలతో కూడినదైనా వన్ ర్యాంకు- వన్ పెన్షన్ అమలుచేశారని అన్నారు.