తెలంగాణ

దేశంలో వేగంగా సంస్కరణలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 28: ప్రధాని నరేంద్రమోదీ దేశంలో సంస్కరణలు చాలా వేగంగా అమలుచేస్తున్నారని, దీంతో బిజెపిపై గతంలో ఉన్న ముద్ర ఇపుడు చెరిగిపోయిందని, అభివృద్ధి పథంలో దేశాన్ని నడిపేందుకు ప్రధాని నిరంతరం కృషి చేస్తున్నారని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. బుధవారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆయన పార్టీ నాయకులను ఉద్ధేశించి మాట్లాడుతూ రెండున్నరేళ్లలోనే సమగ్ర సంస్కరణలను తీసుకువచ్చి ప్రధాని సత్తా చూపారని, 60-70 ఏళ్లలో జరగని ప్రగతికి నాంది పలికారని అన్నారు. భారతీయ జనతా పార్టీని నేడు భారతీయ జనుల పార్టీగా పోల్చుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వ పథకాలకు నెహ్రూ కుటుంబం పేర్లే పెట్టుకున్నారని వెంకయ్యనాయుడు ఆక్షేపించారు. కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలని ఆనాడు మహాత్మాగాంధీ పేర్కొన్నారని కాని, చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే విధంగా కాంగ్రెస్ తీరు ఉందని అన్నారు. చేనేత రాట్నం వద్ద ప్రధాని మోదీ కూర్చుంటే విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. స్వదేశీ వస్త్రాలను ప్రోత్సహించేందుకు రాట్నం దగ్గర మోదీ కూర్చున్నారని అన్నారు. 62 శాతం మంది ప్రజలు మళ్లీ మోదీయే ప్రధాని కావాలని కోరుకుంటున్నారని సర్వేలు చెబుతున్నాయని అన్నారు. దేశంలో మిషన్ మోదీ నడుస్తోందన్నారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం, ప్రధానంగా వెంకయ్యనాయుడు లక్ష్యంగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు. దక్షిణాదిపై ఉత్తరాది పెత్తనం అంటూ అనవసరంగా వ్యాఖ్యలు చేశారని, నిజాలు తెలుసుకుని మాట్లాడాలని పవన్ పేరు ప్రస్తావించకుండానే ఆయన వ్యాఖ్యానించారు. దేశం అంతా ఒక్కటే అన్నదే బిజెపి సిద్ధాంతమని, ఇంకా ఉత్తరాది, దక్షిణాది ఏంటని, తెలుసుకోకపోతే ఎలా అంటూ పవన్‌ను పరోక్షంగా ప్రశ్నించారు. ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడం పద్ధతి కాదన్నారు. కొంత మంది పనిలేక ట్విట్టర్‌పై కూర్చుంటున్నారని, ఫాలోయింగ్ లేని ట్విట్టర్ పోస్టింగ్‌లు వృధాయేనని అన్నారు. ప్రధాని ట్విట్టర్‌ను లక్షలాది మంది ఫాలో అవుతున్నారని గుర్తుచేశారు. ప్రత్యేక హోదాను మించిన ప్యాకేజీని కేంద్రం ఇస్తోందని, అయినా పెట్టుబడులు పెట్టేవారు ఎవరూ హోదాను కోరడం లేదని వెంకయ్య చెప్పుకొచ్చారు.

చిత్రం..బిజెపి రాష్ట్ర కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతున్న వెంకయ్య