తెలంగాణ

జోగులాంబదేవి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలంపూర్, జనవరి 28: అష్టాదశ శక్తిపీఠాలలో 5వ శక్తిపీఠంగా విరాజిల్లుతున్న శ్రీ జోగులాంబ సమేత బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాల్లో శనివారం శ్రీ జోగులాంబదేవి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం శ్రీ జోగులాంబదేవి అమ్మవారి ఆలయం నుంచి ఇఓ గురురాజ, అర్చక స్వాములు స్వామివారి పట్టువస్త్రాలను బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయానికి తీసుకువచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆలయంలో ఉన్న త్రిశూలానికి పూజలు చేసి పల్లకి సేవలో శ్రీ జోగులాంబంబదేవి ఉత్సవ విగ్రహాన్ని, త్రిశూలాన్ని మేళతాళాల మధ్య అమ్మవారి ఆలయానికి తీసుకువచ్చారు. పూజా కార్యక్రమాల్ల9 తహశీల్దార్ మంజుల, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం గణపతి పూజ, పుణ్యహవాచనం, మహాకళశ స్థాపన తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. సాయం త్రం స్థానిక ఎమ్మెల్యే సంపత్‌కుమార్ శ్రీ జోగులాంబదేవి, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ జోగులాంబదేవి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా సాయంత్రం ధ్వజారోహణ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే సంపత్‌కుమార్ పాల్గొన్నారు. అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలను ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు తగు ఏర్పాట్లను ఇఓ గురురాజ చేస్తున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలుగకుండా తగు చర్యలు చేపడుతున్నారు.

చిత్రం..జోగులాంబ సన్నిధిలో ఎమ్మెల్యే సంపత్‌కుమార్