తెలంగాణ

తెలంగాణలో హీనెకెన్ లాగర్ బీర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 29: హీనెకెన్ లాగర్ బీర్ తయారీ, బాటిల్స్‌లో నింపడం, మార్కెటింగ్ చేస్తున్న యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ తన ఉనికిని మరింత బలోపేత చేసుకోవడంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోకి మొదటిసారిగా ప్రవేశించింది. ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ బీర్ బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా 192దేశాలలో లభిస్తోంది. ఇప్పటికే దేశంలోని అన్ని ప్రధాన మార్కెట్‌లలో తన ఉనికి చాటుకుని, అత్యంత విచక్షణను కలిగిన భారతీయ బీర్ ప్రేమికులను లక్ష్యంగా పెటుటకున్న హీనెకెన్ లాగర్ బీర్‌కు తెలంగాణ బీర్ మార్కెట్ వ్యూహాత్మకంగా ఎంతో ముఖ్యమైంది. హీనెకెన్ ప్రపంచస్థాయి ప్యాకేజింగ్‌తో అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. సీసా పక్కవైపు, అడుగు భాగాన ఎంబోజింగ్‌తో కూడిన కంపెనీ లోగోను ప్రత్యేకంగా వేశారు. ఈ ఎంబోజ్ లోగోను నాణ్యత, ప్రామాణికతకు ఒక ప్రత్యేక ముద్రగా పరిగణించవచ్చు. దేశంలో మొదటిసారిగా ఏ బీర్ బ్రాండ్ ఉపయోగించని ప్లాస్టిక్ లేబిల్‌తో దీనిని తీసుకురావడం జరిగిందని మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సమర్ సింగ్ షెకావత్ తెలిపారు. ఈ బీర్‌ను సులభంగా గుర్తించడానికి లేబుల్‌పై రేస్‌ట్రాక్ డిజైన్, హీనెకెన్ పదాలతో నవ్వుతో ఉన్నట్టు తెలియజేసే ‘ఇ’అక్షరాలు అత్యంత బ్రాండ్ ప్రాముఖ్యతను సంతరించుకుంది. రిటైల్‌లో 650 ఎంఎల్, 330 ఎంఎల్ సీసాల్లో లభ్యమయ్యే వీటి ధరలు రూ. 180, 100లు ఉన్నాయి. 500 ఎంఎల్ హెన్‌కెన్ స్టార్ కేన్‌ను రూ. 120లకు లభిస్తుందని మార్కెటింగ్ వైస్ చైర్మన్ సమర్‌సింగ్ షెకావత్ పేర్కొన్నారు.