తెలంగాణ

కోదండరామ్ ఓవరాక్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 30: కాంగ్రెస్ పార్టీ డైరెక్షన్‌లో టిజాక్ నేత కోదండరామ్ ఓవర్ యాక్షన్ చేస్తున్నారని టిఆర్‌ఎస్ నాయకులు విమర్శించారు. ఎంపిలు బాల్కసుమన్, ఎంపి సీతారామ్‌నాయక్, ఎమ్మెల్యే గాదరి కిషోర్, ఎమ్మెల్సీలు రాములు నాయక్, మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య టిఆర్‌ఎస్‌ల్‌పిలో సోమవారం జరిగిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఉద్యోగ విరమణ చేసిన కోదండరామ్ కొందరు నిరుద్యోగులకు నాయకుడిగా మారిపోయారని అన్నారు. ఉద్యోగ నియామకాలకు సంబంధించి వరుసగా నోటిఫికేషన్లు రావడంతో, నిరుద్యోగులు పరీక్షలకు సిద్ధం అవుతుంటే కోదండరామ్ మాత్రం తప్పడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలను లోకమంతా మెచ్చుకుంటుంటే కోదండరామ్‌కు మాత్రం కనిపించడం లేదని విమర్శించారు. కోదండరామ్ తన వైఖరి మార్చుకోవాలని అన్నారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే విధంగా మాట్లాడితే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీకి ఏజెంట్‌గా మారిపోయి మాట్లాడుతున్నారని బాల్కసుమన్ విమర్శించారు. కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, జెఎసి నాయకులు కోదండరామ్ వ్యాఖ్యలు అర్ధరహితం అని ఎంపి సీతారామ్ నాయక్ విమర్శించారు. ఆరవై ఏళ్ల కాంగ్రెస్ పాలనలో చేయని అభివృద్ధిని రెండున్నర ఏళ్లలో టిఆర్‌ఎస్ చేసి చూపించిందని అన్నారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్టు చెప్పారు.
ఆ మాటలు అర్ధరహితం
చిదంబరం, కోదండరామ్ తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వంపై అసందర్భ విమర్శలు చేస్తున్నారని శాసన మండలిలో ప్రభుత్వ చీఫ్‌విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు. చిదంబరం సామాన్య కార్యకర్త కన్నా దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు. ముస్లిం, ఎస్టీ రిజర్వేషన్లపై కసరత్తు జరుగుతోందని, సాంకేతిక అంశాలపై కసరత్తు పూర్తయిన తరువాత అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నట్టు చెప్పారు.