తెలంగాణ

పెద్దనోట్లపై చర్చ కోరాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 30: పెద్ద నోట్ల రద్దుపై పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో చర్చించాలని అఖిలపక్ష సమావేశంలో కేంద్రాన్ని డిమాండ్ చేసినట్టు టిఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ జితేందర్ రెడ్డి వెల్లడించారు. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగేందుకు సోమవారం ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన అఖిల పక్ష సమవేశానికి జితేందర్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం తన నివాసంలో జితేందర్‌రెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ బడ్జెట్ మొదటి దశ సమావేశాలు చివరి మూడు రోజులు నోట్ల రద్దు అంశం పార్లమెంట్‌లో చర్చ జరపాలని కేంద్రాన్ని కోరామన్నారు. ముఖ్యంగా ఏప్రిల్ 1లోగా బడ్జెట్‌ను అమల్లోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ముందస్తుగా బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేశామని, ఐదు రాష్ట్రాల ఎన్నికల దృష్టిలో పెట్టుకొని కాదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారని ఆయన అన్నారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో ఉమ్మడి హైకోర్టు విభజన, తెలంగాణ రాష్ట్రానికి ఐఐఎం, ఎయిమ్స్ ప్రకటించాలని కోరినట్లు జితేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. కేంద్రం నుంచి రావల్సి ఉన్న బకాయిలు, రైల్వేలైన్లు, వెనుకబడిన జిల్లాలకు నిధులు, నీతి ఆయోగ్ సిఫార్సుల ప్రకారం మిషన్ భగీరధ, మిషన్ కాకతీయకు నిధులు కేటాయించాలని కోరినట్లు చెప్పారు.