తెలంగాణ

ఇది యుపిఎ కాదు, ఎన్‌డిఎ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 30: పెద్ద నోట్ల రద్దు ఒక కుంభకోణమని చిదంబరం పేర్కొనడం హాస్యాస్పదమని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. ఇఎస్‌ఐసి కార్యాలయంలో సోమవారం నాడు జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న దత్తాత్రేయ అనంతరం పాత్రికేయులతో మాట్లాడారు. ప్రధాని తీసుకున్న నిర్ణయంపై ప్రజలు సంపూర్ణ మద్దతు ప్రకటించారని దత్తాత్రేయ చెప్పారు. అధిక ముఖవిలువున్న నోట్ల చెలామణి రద్దు చేసిన తర్వాత అన్ని ఉప ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపికి, ఎన్‌డిఎకు పూర్తి మద్దతు లభించిందని, ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గ్రహించాలని దత్తాత్రేయ అన్నారు. బ్యాంకుల్లో ఎటిఎంలలో ప్రస్తుతం జనులు బారులు తీరే దృశ్యం కనిపించడం లేదని, కేవలం కాంగ్రెస్ మనుషులే నోట్ల చలామణి రద్దుపై ఫిర్యాదు స్వరాన్ని వినిపిస్తున్నారని అన్నారు.