తెలంగాణ

బంజారాహిల్స్‌లో కారు బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్(ఖైరతాబాద్), జనవరి 30: రాజధాని హైదరాబాద్‌లో సోమవారం ఓ కారు బీభత్సాన్ని సృష్టించింది. అతివేగంగా వచ్చిన ఓ కారు బంజారాహిల్స్ షేక్‌పేట నాలా సమీపంలో విధ్వంసానికి కారణమైంది. కేంద్ర ప్రభుత్వ సహాయంతో అపోలో ఆసుపత్రిలో నర్సింగ్ శిక్షణ పొందుతున్న సుమారు 13 మంది నర్సింగ్ విద్యార్థులు ఈ ప్రమాదంలో గాయపడ్డారు. సోమవారం ఉదయం పల్స్‌పోలియో కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి పోలియో చుక్కలు వేసేందుకు శిక్షణ పొందుతున్న నర్సులు ఆటోల కోసం వేచి ఉన్నారు. అంతకుముందే ఓ బ్యాచ్ విద్యార్థులు వేరే ఆటోల్లో వెళ్లిపోగా తమకు నిర్దేశించిన స్థానాలకు వెళ్లేందుకు మరికొందరు అక్కడే వేచి ఉన్నారు. ఈ క్రమంలో ఉదయం 9:30 గంటల ప్రాంతంలో వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి వీరిని ఢీ కొట్టుకుంటూ దూసుకుపోయింది. ప్రమాదంలో 11 మంది స్వల్పగాయాలతో బయటపడగా లినా, యోగిత అనే ఇద్దరు విద్యార్థినులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని హుటాహుటిన ఆపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగానే ఉందని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ కారును అక్కడే వదిలి పారిపోయాడు. బంజారాహిల్స్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలను సేకరించి కారు స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఐ గోవర్దన్‌రెడ్డి ఆధ్వర్యంలోని బృందం కారు డ్రైవర్ శ్రీకాంత్‌ను అదుపులోనికి తీసుకున్నారు.