తెలంగాణ

డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 30: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో గుట్టుచప్పుడు కాకుండా కార్యకలాపాలు నిర్వహిస్తున్న మాదకద్రవ్యాల ముఠా గుట్టు రట్టయింది. నార్త్, వెస్ట్‌జోన్ టాస్క్ఫోర్స్ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో కొకైన్ ముఠా పట్టుబడింది. ఈ ముఠా సభ్యులతో పాటు సినీ హీరో అభిషేక్ కుమార్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు పట్టుబడిన ఈ ముఠా సభ్యుల్లో దక్షిణాఫ్రికా, ఘనా దేశాలకు చెందిన ఇద్దరు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు ఉన్నారు. సోమవారం వీరు జూబ్లీహిల్స్‌లో సినీ హీరోతో పాటు మరో వ్యక్తికి డ్రగ్స్ అందజేస్తుండగా టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.46 వేల నగదు, 370 గ్రాముల కొకైన్, 12 సెల్‌ఫోన్లు, ఒక ఫోర్డ్ కారు, మరో బైక్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా సభ్యుల్లో ఒకడైన దక్షిణాఫ్రికా పౌరుడు మండేలా జేమ్స్ (38), ఘనా దేశస్తుడైన డ్రాకెన్ ఒవెన్ (27) బిజెనెస్ వీసాలపై 2011లో భారత్‌కు వచ్చి దుస్తుల ఎగుమతి వ్యాపారం చేస్తున్నారు. అయితే సులువుగా డబ్బు సంపాదించాలన్న నిర్ణయంతో డ్రగ్స్ వ్యాపారాన్ని ఎంచుకున్న వీరు ముంబయిలో ఒక గ్రాము కొకైన్ రూ.3500కు కొనుగోలు చేసి హైదరాబాద్‌లో దాదాపు రూ.5 వేలకు అమ్మడం ప్రారంభించారు. గత సంవత్సరం ముంబయిలో జరిగిన ఒక కార్యక్రమంలో సినీ హీరో అభిషేక్‌కుమార్ కొకైన్ కావాలని కోరడంతో వీరు సరఫరా చేస్తున్నారు. అప్పుడప్పుడు అభిషేక్ తన స్నేహితులకు కూడా కావాలని ఒక్కొక్కరికి 15 నుంచి 20 గ్రాముల చొప్పున కొకైన్ తెప్పించేవాడు. గత ఏడాది ఫిబ్రవరిలో వీరితో పరిచయం ఏర్పరచుకుని హైదరాబాద్‌లో కొకైన్ వ్యాపారం చేస్తున్న చిత్తూరు వాసి జి.శ్రీనివాసులును డిసెంబర్‌లో ఎస్‌ఆర్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. బెయిలుపై విడుదలైన శ్రీనివాసులు మళ్లీ డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు. అభిషేక్ ఆర్డర్ మేరకు ముంబయి నుంచి సుమారు 370 గ్రాముల కొకైన్‌ను తీసుకొచ్చిన మండేలా జేమ్స్, ఉవెన్, జి.శ్రీనివాసులు సోమవారం దానిని జూబ్లీహిల్స్‌లో అభిషేక్‌కు ఇస్తుండగా టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ వ్యాపారంతో భాగస్వామ్యం ఉన్న జెఇ.జీవన్‌కుమార్, ఎం.శ్రీనివాస్‌తోపాటు ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. విచారణ నిమిత్తం వీరిని జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించామని టాస్క్ఫోర్స్ డిసిపి తెలిపారు.

చిత్రం..పట్టుబడిన మాదకద్రవ్యాల ముఠా సభ్యులు