తెలంగాణ

ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 30: పెరుగుతున్న ఇంధన భారాన్ని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ వనరుల వినియోగంపై దృష్టి సారించనున్నట్టు రవాణాశాఖ మంత్రి డాక్టర్ పి.మహీందర్‌రెడ్డి తెలిపారు. ఈనెల 16 నుంచి ఫిబ్రవరి 15 వరకు నిర్వహిస్తున్న ఇంధన పొదుపు మాసోత్సవాల్లో భాగంగా సోమవారం ఆర్టీసీ కళాభవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో
ఇంధన పొదుపులో ఉత్తమ ప్రతిభ కనబర్చిన డ్రైవర్లకు సోమవారం ఆర్టీసీ కళాభవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సంస్థ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, మేనేజింగ్ డైరెక్టర్ జివి.రమణరావు అవార్డులు అందజేశారు. ఈ నెల 16వ తేదీ నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఇంధన పొదుపు మాసోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ, ఆర్టీసీ ఆదాయంలో అధిక మొత్తాన్ని ఇంధనానికే వెచ్చించాల్సి వస్తోందన్నారు. ఆర్టీసీలోని 10,500 బస్సులకు ఏటా అవసరమవుతున్న 19 కోట్ల 51 లక్షల లీటర్ల ఇంధనం కోసం రూ.975 కోట్లు ఖర్చవుతోందని, కనుక ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి సారించి బయోడీజిల్ వినియోగాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ప్రస్తుతం 35 డిపోల్లో బయోడీజిల్‌ను వాడుతున్నామని, దీంతో రూ.6 కోట్లు ఆదా అవుతోందని మంత్రి చెప్పారు. ఇంధన పొదుపు కోసం రాష్ట్రంలోని అన్ని డిపోల్లో సర్వే చేయించి నిర్మాణాత్మ చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్టీసి ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి కెసిఆర్ 44 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చారని, సుమారు రూ.1000 కోట్ల ఆర్థిక సహాయం చేశారని ఆయన చెప్పారు. సోమారపు సత్యనారాయణ మాట్లాడుతూ, ఆర్టీసీలో ఇంధన పొదుపునకు యాజమాన్యం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. 55 మంది డ్రైవర్లు, 12 మంది మెకానిక్‌లు, మరో 12 మంది ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్లకు అవార్డులు అందజేసిన ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఇడిలు వేణు, నాగరాజు, పురుషోత్తం నాయక్, రవీందర్, ఆర్‌ఎంలు యాదగిరి, గంగాధర్, వినోద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..ఉత్తమ డ్రైవర్లకు అవార్డులు అందజేస్తున్న మంత్రి మహేందర్‌రెడ్డి