హైదరాబాద్

విమానమేళా.. నగరానికి దిగొచ్చిన వేళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బేగంపేట: దేశ, విదేశాల్లో గగన తలంలో దూసుకెళ్లే విమానాలు నింగిని వదిలి భాగ్యనగర నేలకు దిగొచ్చిన శుభవేళ. మరో అరుదైన ఎయిర్‌షోకు నగరం వేదికైంది. నగరంలో భారత విమానయాన సంస్థ నిర్వహించిన ఇండియా ఏవియేషన్ షో బేగంపేట ఎయిర్‌పోర్టు ప్రాంగణంలో వేదికైంది. ప్రారంభానికి భారత రాష్టప్రతి ప్రణబ్‌ముఖర్జీ, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు, గవర్నర్ నరసింహన్, మంత్రులు కెటిఆర్, హరీశ్‌రావు, ఈటల రాజేందర్, నాయిని నర్సింహ్మారెడ్డి, లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ఏయిర్‌షోలో వివిధ దేశాల నుంచి 29కిపైగా ఎయిర్‌క్రాఫ్ట్‌లను ప్రదర్శించారు. వీటితోపాటు 12 దేశాలకు చెందిన 200 మంది ఎగ్జిబిటర్లు తమ ఉత్పత్తులను ప్రదర్శనలో కొలువుదీర్చారు. మొదటిసారిగా మనదేశంలో ఎయిర్‌బస్ ఎ-320 ఇక్కడ ప్రదర్శనలో ఏర్పాటు చేశారు. పూర్తిగా ఎకోఫ్రెండ్లీగా రూపుదిద్దుకున్న ఎయిర్‌బస్ ఇండిగోను ఎయిర్‌లైన్స్‌కు అందించారు. ఆసియాలోనే ఈ అత్యాధునిక ఏయిర్ క్రాఫ్ట్‌ను పరిచయం చేస్తున్న ఏయిర్‌లైన్ ఇండిగోగా నిలిచింది. పర్యావరణానికి పూర్తిగా అనుకూలంగా విమానం, ఎయిర్‌బస్, ఎ-320ను పేర్కొనడమేకాదు, మిగిలిన విమానాలతో పోలిస్తే 15శాతం ఇంధనం ఆదా అవుతుందని ఏయిర్ ఇండిగో ప్రతినిధులు తెలిపారు. కాగా, ప్రదర్శన జరిగే ఐదు రోజుల్లో తొలి మూడు రోజుల బిజినెస్ ప్రతినిధులను అనుమతించగా, చివరి రెండు రోజుల సాదారణ సందర్శకులను అనుమతిస్తారు.
అడుగడుగునా నిఘా
ఎయిర్ షోను ప్రారంభోత్సవానికి రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ విచ్చేస్తున్నందున పోలీసులు అడుగడుగున నిఘాను, పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. నగర పోలీసులతో పాటు సిఐఎస్‌ఎఫ్ వంటి ఇతర అదనపు బలగాలు మొత్తం బేగంపేట ఎయిర్‌పోర్టును తమ ఆధీనంలోకి తీసుకున్నారు. నార్త్‌జోన్ డిసిపి ప్రకాశ్‌రెడ్డి నేతృత్వంలో పోలీసులు బందోబస్తును నిర్వహిస్తున్నారు.
ప్రత్యేక ఆకర్షణగా 3
మార్క్ జెఫరీస్ ఎక్రో బాటిక్స్2
రెండేళ్ల క్రితం నగరంలో జరిగిన ఎయిర్ షో నగర వాసుల స్మతి పథంనుంచి ఇంకా చెరిగిపోయి ఉండదు. గగుర్పాటు కల్పించే తమ విన్యాసాల ద్వారానే కవ్వించి, నవ్వించి ఆనందోత్సాహాలు పంచిన మార్క్ జెఫరీస్ ఎయిర్ షోలో 16 నుంచి 20 వరకు బేగంపేట ఎయిర్‌పోర్టులో తమ విన్యాసాలను ప్రదర్శించనున్నారు. గతంలో రెండు విమానాలతోనే అద్భుతాలు సృష్టించిన వీరు ఈసారి మాత్రం నాలుగు ఎయిర్ క్రాఫ్ట్‌లతో ప్రదర్శన ఇవ్వడం జరిగింది. 330ఎస్‌సి ఏయిర్‌క్రాఫ్ట్‌తో ప్రదర్శనలు ఇస్తున్న నలుగురు బ్రిటీష్ పైలెట్లు మార్క్ జెఫరీస్, టామ్ కాస్సల్స్, క్రిస్ బర్కట్ స్టీవ్ కార్కర్, మైకేల్ పికిన్ గ్లోబల్‌స్టా కలిసి ఎక్రోబాటిక్స్ టీమ్‌గా వీరు పార్కుషన్స్ షోతో పది నిమిషాలు ఆకాశంలో విన్యాసాలు చేపట్టారు. రాష్టప్రతి ప్రసంగం అనంతరం 3.45 గంటలకు ఎయిర్‌పోర్టులో తమ విన్యాసాలను నిర్వహించారు. మొదటిరోజు బిజెనెస్ ప్రతినిధులతోపాటు ఏయిర్‌షోను తిలకించడానికి నగరం నలుమూలల నుంచి తరలివచ్చారు. ఎయిర్‌క్రాఫ్ట్‌ల వద్ద ఫొటోలు దిగుతూ సందర్శకులు ఎయిర్‌షోలో సందడి చేశారు. మరికొందరు తమ సెల్‌ఫోన్లలో సెల్ఫీలు దిగుతూ హడావుడిగా కనిపించారు.

ఉమ్మడి ప్రణాళికతోనే ఉత్తమమైన నగరీకరణ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 16: దేశంలో రోజురోజుకి పెరిగిపోతున్న పట్టణీకరణ నేపథ్యంలో ఉమ్మడి ప్రణాళిలికలను అమలు చేస్తే తప్ప, ఉత్తమమైన నగరీకరణ సాధించలేమని నగర డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్ అన్నారు. ‘దేశంలోని నగరాల అభివృద్ధి రూపకల్పన’ అంశంపై దిల్లీలో జరుగుతున్న జాతీయ స్థాయి సదస్సుకు డిప్యూటీ మేయర్ హాజరయ్యారు. దేశంలోని మున్సిపల్ వ్యవహారాల శాఖకు చెందిన పలు రాష్ట్రాల ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, సీనియర్ ఐఏఎస్ అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ దేశంలోని నగరాల అభివృద్ధి గణనీయంగా ముందుకు సాగుతోందని వ్యాఖ్యానించారు. పెరుగుతున్న దానికి సమానంగా వౌలిక వసతులు, నివాస, ఇతర సౌకర్యాలు కల్పించటంలో విఫలమవుతున్నామని పేర్కొన్నారు. అయితే హైదరాబాద్ నగరాన్ని స్లమ్ ప్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున కార్యక్రమాలను చేపట్టిందని ఆయన వివరించారు. ఇందులో భాగంగానే గ్రేటర్ పరిధిలో మురికివాడలను నివారించి, ఎక్కడున్న పేదవారికి అక్కడే డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన వివరించారు. దేవంలోన ఎక్కడా లేని విధంగా డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మిస్తున్న ఘనత కేవలం తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందని, ఇందుకు సికిందరాబాద్ బోయిగూడలో నిర్మించిన ఐడిహెచ్‌కాలనీ నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత సంవత్సరం గ్రేటర్ పరిధిలో లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. హైదరాబాద్‌లో పారిశుద్ధ్యపరంగా కూడా పరిస్థితులను మెరుగుపరిచేందుకు గాను పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు.
ఇందులో భాగంగానే ప్రతి ఇంటి నుంచి తడి,పొడి చెత్తను వేర్వేరుగా సేకరించేందుకు గాను నగరంలోని 22 లక్షల గృహాలకు గాను 44లక్షల డస్ట్‌బిన్లను అందజేసినట్లు ఆయన తెలిపారు. వివిధ నగరాల్లో అమలవుతున్న ఉత్తమ పథకాలను ఇతర నగరాల్లో కూడా అమలు చేయటానికి సమాచార మార్పిడి మరింత పటిష్టంగా జరగాల్సిన అవసరముందని ఆయన సూచించారు.ఈ సమావేశంలో పలువురు కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు.