తెలంగాణ

పశుసంపదకు భారీగా బడ్జెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 30: రాష్ట్రప్రభుత్వం పశుసంపదకు వచ్చే బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయిస్తుందని పశుసవంర్థక మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు. సచివాలయంలో సోమవారం ఆయన తెలంగాణ నాన్‌గెజిటెడ్ వెటర్నరీ అసోసియేషన్ డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ ప్రభుత్వం పశుగణాభివృద్ధి, మత్స్యసంపదను పెంపొదించేందుకు పాడిని ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. రైతులను ఆర్థికంగా బలోపేతం చేయాలన్నదే తమ ఉద్దేశమన్నారు.
గత ప్రభుత్వాలు పశుసంపద గురించి పట్టించుకోలేదని, దాంతో రైతులు అనేక ఇక్కట్లకు గురయ్యారన్నారు. రైతులకు వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాల వల్ల ఆదాయం లభించాలన్నదే తమ ఉద్దేశమన్నారు. అందుకే గ్రామీణ ప్రాంతాల్లో పశుసంపదను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. పాడిపశువుల పెంపకం, పశుసంరక్షణ, చేపలపెంపకం తదితర అంశాపై దృష్టి కేంద్రీకరించామన్నారు. ఈ విభాగాలకు భారీఎత్తున రాయితీలు, సబ్సిడీ ఇస్తున్నామని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా పశువుల ఆసుపత్రుల్లో పనిచేసేందుకు 161 మంది వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల నియామకాన్ని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఇటీవల చేశామని మంత్రి తెలిపారు.
త్వరలో మరో 180 పోస్టులను భర్తీ చేస్తామన్నారు. రాష్ట్రంలో త్వరలో రెండు మత్స్య కళాశాలను ఏర్పాటు చేస్తామన్నారు. మారుమూల ప్రాంతాలకు కూడా పశువైద్యసేవలు అందించేందుకు వీలుగా, మే నెల నుండి 100 సంచార పశువైద్యశాలలను పారంభిస్తామన్నారు.