తెలంగాణ

తెలంగాణతో నేడు మహా భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: గోదావరిపై తెలంగాణ, మహారాష్ట్ర నిర్మించే ప్రాజెక్టులపై ఇరు రాష్ట్రాల అధికారుల తొలి సమావేశం శనివారం ఉదయం జరుగుతుంది. తెలంగాణ ఏర్పడిన తరువాత మహారాష్ట్ర, తెలంగాణ రెండు రాష్ట్రాలు అంతర్ రాష్ట్ర ప్రాజెక్టులపై నిర్ణయాలు తీసుకోవడానికి అంతర్ రాష్ట్ర జలమండలిని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కెసిఆర్ ముంబై పర్యటనలో ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. అంతర్ రాష్ట్ర జల మండలి తొలి సమావేశం శనివారం ఉదయం పది గంటలకు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరుగుతుంది. అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు ఇరురాష్ట్రాల ఇరిగేషన్ కార్యదర్శులు సమావేశం అవుతారు. ఈ సమావేశాల్లో కీలక అంశాలపై చర్చిస్తారు. అధికారుల స్థాయిలో చర్చల తరువాత ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం అవుతారు. రెండు రాష్ట్రాల మధ్య నదీ జలాల ఒప్పందాలకు సంబంధించి కీలక సమావేశం శనివారం జరుగుతుంది. గోదావరి నదిపై ఇరు రాష్ట్రాలు నిర్మించే ప్రాజెక్టులపై రెండు రాష్ట్రాలు ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చినప్పటికీ అధికారుల స్థాయిలో చర్చల తరువాత ఇరు రాష్ట్రాలకు ప్రయోజనం కలిగే విధంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఒకవైపు చర్చలు సాగుతుండగానే మరోవైపు ప్రభుత్వం గోదావరిపై ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని నిర్ణయించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి 6286 కోట్ల రూపాయలు కేటాయించారు. గోదావరిపై తెలంగాణ నిర్మించే ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం వ్యక్తం చేయగా, ముఖ్యమంత్రి కెసిఆర్ దీన్ని తేలిగ్గా తీసుకున్నారు. మహారాష్ట్ర ఒకవైపు సానుకూలంగా స్పందిస్తే చంద్రబాబు పసలేని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని ముఖ్యమంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ అభ్యంతరాలను పట్టించుకోవలసిన అవసరం లేదని, అధికారులు పనుల్లో వేగం పెంచాలని సూచించారు.
ప్రాణహిత ప్రాజెక్టు తుమ్మిడి హట్టి బ్యారేజీ, కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజీ, లెండి ప్రాజెక్టు, పెన్‌గంగ రాజుపేట వద్ద బ్యారేజీ, పెన్‌గంగపై చనాఖా- కొరాట మధ్య బ్యారేజీ , పంపరాడ్ వద్ద బ్యారేజీ, లోయర్ పెన్ గంగ ప్రాజెక్టుల నిర్మాణంపై ప్రాథమికంగా రెండు రాష్ట్రాలు ఒక అవగాహనకు వచ్చాయి. అయితే రెండు రాష్ట్రాలకు ప్రయోజనం కలిగే విధంగా ఎలా నిర్మాణం చేయాలనే దానిపై శనివారం సాంకేతిక నిపుణులు చర్చలు జరుపుతారు. శనివారం నాటి ర్చల పట్ల రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు ఆసక్తి చూపుతున్నాయి.