తెలంగాణ

ఎడమ కాల్వకు నీరు నిలిపివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జునసాగర్, జనవరి 31: నాగార్జునసాగర్ జలాశయం నుండి ఎడమకాల్వ ద్వారా విడుదల చేస్తున్న నీటిని మంగళవారం డ్యాం అధికారులు నిలిపివేశారు. ఎడమకాల్వ పరిదిలో యాసంగి పంటకుగాను వారబందీ పద్ధతిలో నీటి విడుదల కొనసాగిస్తున్నారు. గతంలో రెండు విడతలుగా విడుదల చేసిన అధికారులు ఈనెల 23నుండి మూడవ విడతగా ఎడమకాల్వ పరిధిలో నీటిని విడుదల చేస్తున్నారు. మంగళవారం నాటితో వారం రోజుల గడువు ముగియడంతో నీటి విడుదలను నిలిపివేశారు. మూడవ విడతలో ఎడమకాల్వ పరిదిలో ఐదు టిఎంసిల నీటిని విడుదల చేసినట్లుగా ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ సునీల్ తెలిపారు. ప్రస్తుతం సాగర్ జలాశయానికి శ్రీశైలం నుండి 6 వేల క్యూసెక్కులు వస్తుండగా జలాశయంలో 513 అడుగుల నీటిమట్టం ఉంది.