తెలంగాణ

రాష్ట్రంలో టీచర్ పోస్టుల వెల్లువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 31: తెలంగాణలో రానున్న రోజుల్లో ఉపాధ్యాయ పోస్టులకు పెద్దఎత్తున రిక్రూట్‌మెంట్ నిర్వహించనున్నారు. వివిధ గురుకులాలతో పాటు పాఠశాల విద్యాశాఖ ఆధీనంలోని ప్రభుత్వ, పంచాయతీరాజ్ పరిధిలోని పాఠశాలల్లో ఉపాధ్యాయులను నియమించనున్నారు. తాజాలెక్కల ప్రకారం అన్ని విభాగాల్లో కలిపి దాదాపు 12వేల టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. రానున్న మూడేళ్లలో వీటిని భర్తీ చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ గురుకులాలు, మైనార్టీ గురుకులాలకు పెద్ద ఎత్తున ఈ ఏడాది రిక్రూట్‌మెంట్ నిర్వహించనున్నారు. ప్రభుత్వం వివిధ దశల్లో ఇప్పటికే గురుకులాల్లోని పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే పంచాయతీ రాజ్ స్కూళ్లలో పోస్టుల భర్తీకి సైతం రిక్రూట్‌మెంట్ నిర్వహించనుంది. తెలంగాణలోని 10 జిల్లాల్లో ఉన్న ఖాళీలను సేకరించిన అధికారులు, తాజాగా జిల్లాల పునర్విభజనతో మరోమారు 31 జిల్లాల్లో ఖాళీలపై కసరత్తు నడుస్తోంది. జిల్లాల వారీ రోస్టర్ ప్రకారం ఖాళీలను, రిజర్వేషన్లను ఖరారు చేయాల్సి ఉంటుంది. రిజర్వేషన్ల ప్రకారం ఖాళీల జాబితాలు ఆయా జిల్లాల కలెక్టర్లు ద్వారా పాఠశాల విద్యాశాఖకు రాగానే ఆ జాబితాను పబ్లిక్ సర్వీసు కమిషన్‌కు పంపించనుంది. దాని ప్రకారం టిఎస్‌పిఎస్‌సి నోటిఫికేషన్ ఇస్తుంది. టీచర్ల రిక్రూట్‌మెంట్‌కు మరో పెద్ద అవరోధంగా టెట్ వ్యవహారం మారింది. టెట్ నిర్వహించకుండా నేరుగా టీచర్ల నియామకాలతో న్యాయవివాదాలు తలెత్తుతాయా అనే కోణంలో అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో టెట్‌ను ఎంపిక పరీక్షలో భాగంగానే ఒక పేపర్‌గా నిర్వహించారు. అదే రీతిలో తెలంగాణలో సైతం నిర్వహించాల్సి ఉంటుందా లేక నేరుగా ఎంపిక పరీక్ష నిర్వహించవచ్చా అని అడ్వకేట్ జనరల్ అభిప్రాయం కోరినట్టు తెలిసింది. ఒక వేళ టెట్‌ను నిర్వహించాల్సి వస్తే అందుకు పాఠశాల విద్య ప్రత్యేకంగా ఒక కమిటీని నిర్వహించి ఆ కమిటీ ద్వారా పరీక్ష పెట్టాల్సి వస్తుంది. ఈ అంశంపై స్పష్టత రాగానే టీచర్ల రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ఇస్తారు. మైనార్టీ గురుకులాలల్లో 4137 బోధన పోస్టులకు, 692 అవుట్ సోర్సింగ్ పోస్టులకు తాజాగా అనుమతి ఇచ్చింది. ఇందులో ఈ ఏడాది 1640 పోస్టులు, వచ్చే ఏడాది 1494 పోస్టులు, 2019-20 సంవత్సరం 1695 పోస్టులను భర్తీ చేయనున్నారు.