తెలంగాణ

సలహాదారులకు క్యాబినెట్ హోదానా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 31: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులకు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లకు, ప్రత్యేక ప్రతినిధులకు రాష్ట్ర మంత్రి హోదా కల్పించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి హైకోర్టులో మంగళవారం దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ విచారణకు చేపట్టింది. ఇలా నియమించడం వల్ల వేల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నదని రేవంత్‌రెడ్డి ఆ పిటిషన్‌లో ఆరోపించారు. రాజ్యాంగం ప్రకారం ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి మంత్రివర్గ కూర్పు 15 శాతానికి మించరాదని, అయితే ప్రభుత్వం ఇష్టానుసారంగా మంత్రి హోదా కల్పిస్తున్నదని, దీంతో ప్రజాధనం వృథా అవుతోందన్నారు. ఆయన వాదించారు. ప్రధాన న్యాయమూర్తి స్పందిస్తూ ఎమ్మెల్యేలు కాని వారికి మంత్రి హోదా ఇవ్వడానికి గల అర్హతలు ఏమిటో తెలియజేయాలని అడ్వకేట్ జనరల్‌కు సూచించారు. కేసు విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు.