తెలంగాణ

ముచ్చట తీర్చిన ‘మొక్క’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, జనవరి 31: హరితహారం మొక్క ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ముచ్చట తీర్చింది. చిగురిస్తున్న కలల పథకం కలెక్టర్‌పై ప్రశంసల జల్లు కురిపించింది.
మంగళవారం భక్తరామదాసు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించేందుకు ఖమ్మం జిల్లా పర్యటనకు హైదరాబాద్ నుండి రోడ్డుమార్గాన వెళ్లిన సిఎం జాతీయ రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలను పరిశీలిస్తూ వచ్చారు. జిల్లాకేంద్రంలోని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి నివాసంలో మధ్యాహ్న భోజనం చేసేందుకు ఆగిన ముఖ్యమంత్రి అక్కడ సూర్యాపేట, నల్లగొండ కలెక్టర్‌లు కడవేరు సురేంద్రమోహన్, గౌరవ్ ఉప్పల్‌ను అభినందించారు. హరితహారం నిర్వహణ పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. ఇదే రీతిన మొక్కలను సంరక్షించాలని, హరితహారాన్ని ఉద్యమంలా నిర్వహించాలని ఆయన ఆదేశించారు. హరితహారం నిర్వహణకు నిధులు కొరత లేదని, ఎన్ని నిధులైన ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు సిఎం వారికి స్పష్టంచేశారు. నూతనంగా ఏర్పాటైన సూర్యాపేట జిల్లాను అభివృద్ధి చేసేందుకు, వివిధ పథకాలను అమలు చేయడంలో కలెక్టర్ సురేంద్రమోహన్ విశేషంగా కృషిచేస్తున్నట్లు తనకు నివేదికలు అందినట్లు చెబుతూ ప్రశంసించారు. ఇదేవిధంగా ముందుకు సాగుతూ అభివృద్ధికి కృషిచేయాలన్నారు. త్వరలోనే తాను జిల్లా పర్యటనకు వస్తానని, అప్పుడు అన్ని అంశాలపై సమగ్రంగా చర్చిస్తానని చెప్పారు.