తెలంగాణ

సరస్వతి నామస్మరణతో మార్మోగిన బాసర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాసర, ఫిబ్రవరి 1: వసంత పంచమిని పురస్కరించుకుని సరస్వతి నామస్మరణతో నిర్మల్ జిల్లా పరిధిలోని బాసర క్షేత్రం మార్మోగిపోయంది. అమ్మవారి జన్మదినం మూల నక్షత్రాన్ని పురస్కరించుకుని బుధవారం సరస్వతిదేవిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. బుధవారం బాసర సరస్వతిదేవి అమ్మవార్లకు తెల్లవారుఝామున అభిషేక, అర్చన పూజలు నిర్వహించి ఐదు గంటలకు అక్షరస్వీకార పూజలు ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల నుండే కాక వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. ఉదయం నుండి ప్రారంభమైన అక్షరస్వీకార పూజల సందడి సాయంత్రం 5 గంటల వరకు నిరంతరాయంగా కొనసాగింది. ఒక్కో బ్యాచ్‌కు రెండు నుండి మూడు గంటల సమయం పట్టడంతో భక్తులు చిన్నారులు క్యూలైన్‌లో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. క్యూలైన్‌ల ఏర్పాట్లలో అధికారులు బెంచ్‌లు ఏర్పాటుచేయకపోవడంతో పలువురు భక్తులు సొమ్మసిల్లి పడిపోయారు. అమ్మవారి సన్నిధిలో వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ అర్చకులు సువర్ణ పుష్పార్చన, మహాపూజ కార్యక్రమాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో భక్తులు పాల్గొని అమ్మవారి ప్రసాదాలను స్వీకరించారు. రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే జి.విఠల్‌రెడ్డి, ఆలయ చైర్మెన్ శరత్‌పాటక్, మంగళవాయిద్యాలు, అర్చకుల వేద మంత్రోచ్ఛారణల మధ్య అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ఏర్పాట్ల గురించి భక్తులను అడిగి తెలుసుకున్నారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి పాటుపడుతుందని, దశలవారీగా బాసర క్షేత్రాన్ని అభివృద్ధి పరుస్తామని పేర్కొన్నారు. వసంత పంచమికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లుచేసినట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు త్వరలో బాసర క్షేత్రాన్ని సందర్శిస్తారని ఆశాభావం వ్యక్తంచేశారు. వసంత పంచమి పురస్కరించుకుని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖాశ్యాంనాయక్, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు, పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి, నిర్మల్ జాయింట్ కలెక్టర్ శివలింగయ్య, అమ్మవార్లను దర్శించుకుని పూజలుచేశారు. 3 వేల మంది చిన్నారులకు ఆలయ అర్చకులు అక్షరస్వీకార పూజలు నిర్వహించినట్లు అధికారులు పేర్కొన్నారు. దాదాపు 80 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. భైంసా డిఎస్పీ అందెరాములు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేశారు.
chitram...
అమ్మవారికి పట్టు వస్త్రాలు తీసుకువస్తున్న మంత్రి అల్లోల తదితరులు * చిన్నారికి అక్షరస్వీకార పూజ నిర్వహిస్తున్న ఆలయ అర్చకుడు