తెలంగాణ

డాక్టర్లు బాగానే పనిచేస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 1: ఉస్మానియా ఆసుపత్రిలో వైద్యపరికరాలు బాగానే పనిచేస్తున్నాయని, వైద్యులు బాగానే పనిచేస్తున్నారని రాష్టవ్రైద్యమంత్రి సి. లక్ష్మారెడ్డి తెలిపారు. ఉస్మానియా దవాఖానలోని న్యూరోసర్జరీ వార్డులో ఆక్సిజన్ సరిగా అందని కారణంగా నలుగురు చనిపోయారంటూ మీడియాలో జరిగిన ప్రచారానికి స్పందించిన మంత్రి ఈ అంశంపై విచారణకు ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజేశ్ తివారీ విచారణ జరిపి నివేదికను మంత్రికి అందించారు. తివారీతో పాటు డిఎంఇ రమణి, ఉస్మానియా దవాఖాన సూపరింటెండెంట్‌లతో బుధవారం మంత్రి సమీక్షించారు.
అక్యూట్ న్యూరో సర్జికల్ వార్డులో మంగళవారం మరణించిన బషీర, లక్ష్మణ్, రాజుతోపాటు గుర్తుతెలియని మరోవ్యక్తి ప్రమాదాల కారణంగా తలలకు బలమైన గాయాలు తగిలి చికిత్స పొందుతూ మరణించాలని నిర్దారించారు. వైద్యం సరిగ్గానే అందిందని, వైద్యులు సక్రమంగానే పనిచేశారని మంత్రి వివరించారు. ఆధునిక వసతులను ఏర్పాటు చేయాలని, ఇప్పుడు అందిస్తున్న వైద్యం బాగానే ఉన్నప్పటికీ, ఆధునిక చికిత్స విధానాలను అమలు చేయాలని మంత్రి లక్ష్మారెడ్డి సూచించారు.