తెలంగాణ

7 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 2: ఎమ్మెల్సీ స్థానాల కోసం టిఆర్‌ఎస్‌లో ముందస్తుగానే ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి. మొత్తం ఏడు స్థానాలు ఖాళీ కానున్నాయి. త్వరలోనే వీటి భర్తీకి నోటిఫికేషన్ వెలువడుతుంది. ఎమ్మెల్యే కోటాలో మూడు స్థానాలు ఖాళీ అవుతున్నాయి. శాసన సభలో బలాబలాల ప్రకారం ఈ మూడూ టిఆర్‌ఎస్‌కే లభించే అవకాశం ఉంది. స్థానిక సంస్థల కోటాలో ఒకటి, టీచర్స్ కోటాలో ఒకటి, గవర్నర్ కోటాలో రెండు స్థానాలు ఖాళీ అవుతాయి. టీచర్స్ కోటాలో పోటీ ఉన్నా, మిగిలిన ఆరు స్థానాలు టిఆర్‌ఎస్‌కే లభించే అవకాశం ఉంది. మార్చి 29న టీచర్స్ ఎమ్మెల్సీ ఖాళీ అవుతుంది. రాజేశ్వరరావు, ఎం రంగారెడ్డి, గంగాధర్‌గౌడ్, ఫరూఖ్ హుసేన్‌ల స్థానాలు ఖాళీ అవుతాయి. టీచర్ల నియోజక వర్గం నుంచి ఎన్నికైన కాటేపల్లి జనార్థన్‌రెడ్డి పదవీ కాలం ముగియనుంది.