తెలంగాణ

మాస్టర్ ప్లాన్ ప్రకారమే ఫార్మాసిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 2: మాస్టర్ ప్లాన్ ప్రకారమే ఫార్మాసిటీ కార్యక్రమాలను ప్రారంభించాలని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావు అధికారులను ఆదేశించారు. ఫార్మాసిటీ మాస్టర్ ప్లాన్ తయారీని మంత్రి గురువారం సమీక్షించారు. ఫార్మాసిటీ మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్న సుర్బానా జరోంగ్ కంపెనీ ప్రతినిధులు ఈ ప్రణాళికను వివరించారు. గత సమీక్షా సమావేశంలో సూచించిన విధంగా కాలుష్యాన్ని పూర్తిగా తగ్గించేందుకు తీసుకోవలసిన చర్యలను ఈ మాస్టర్ ప్లాన్‌లో పొందు పరుస్తున్నట్టు మంత్రికి తెలిపారు. ఫార్మాసిటీకి రోడ్డు సౌకర్యాలు, కనీస సౌకర్యాలపై మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఫార్మాసిటీలో ఒక ఫెసిలిటి భవనం నిర్మిస్తున్నట్టు చెప్పారు. ఫార్మాసిటీ తొలి దశ కోసం ఇప్పటి వరకు 5500 ఎకరాల భూమి సేకరించినట్టు అధికారులు తెలిపారు. టిఎస్ ఐఐసి కార్యాలయంలో గురువారం నూతన బోర్డు రూమ్‌ను కెటిఆర్ ప్రారంభించారు. అనంతరం ఫార్మాసిటీపై సమీక్ష జరిపారు. అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీపై పలు ఫార్మా కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు. నాణ్యతా ప్రమాణాలు పాటించే పలు కంపెనీలు వస్తున్నాయని చెప్పారు. ఫార్మాసిటీ నిర్మాణం పనుల్లో వేగం పెంచాలని సూచించారు. టిఎస్‌ఐఐసి చైర్మన్ బాలమల్లుతో కెటిఆర్ సమావేశం అయ్యారు. టిఎస్‌ఐఐసి ద్వారా చేపట్టిన పలు పారిశ్రామిక పార్కుల అభివృద్ధి పనులను బాలమల్లు మంత్రికి వివరించారు. సమీక్ష సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, టిఎస్‌ఐఐసి ఎండి వెంకట నర్సింహారెడ్డి కూడా పాల్గొన్నారు.

చిత్రం..గురువారం సమీక్షా సమావేశంలో ఫార్మాసిటీ మాస్టర్ ప్లాన్‌ను పరిశీలిస్తున్న మంత్రి కెటిఆర్