తెలంగాణ

జాతీయ జెండాను అవమానించిన డిప్యూటీ సిఎం, హోంమంత్రిపై చర్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 3: జాతీయ జెండాను అవమానించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిపై (1971 చట్టం ప్రకారం) చర్య తీసుకోవాలని టి.పిసిసి ప్రధాన కార్యదర్శి బక్క జడ్సన్ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారిని కోరారు. ఈ మేరకు స్పీకర్‌కు ఆయన శుక్రవారం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ప్రతులను రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీకి, ప్రధాని నరేంద్ర మోదీకి, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి పంపించారు. వారు అధికార పదవిలో ఉంటూ టిఆర్‌ఎస్ కార్యాలయంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలో పాల్గొన్నారని తెలిపారు. వరంగల్ మున్సిఫ్ మేజిస్ట్రేట్ వద్ద పిటిషన్ దాఖలు చేసినట్లు ఆయన చెప్పారు.