తెలంగాణ

మున్సిపాలిటీల్లో ఏకీకృత సర్వీసు రూల్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 3: మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లనలో ఏకీకృత సర్వీసు రూల్స్‌ను తీసుకు వచ్చినట్టు, దీనివల్ల పనితీరు మెరుగు పడుతుందని మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కె తారక రామారావు తెలిపారు. పట్టణాల పారిశుద్ధ్యం, వౌలిక వసతుల కల్పనలో ఆదర్శవంతమైన ఆచరణ నుంచి పరస్పరం నేర్చుకునేందుకే ఏకీకృత సర్వీసు రూల్స్ తీసుకు వచ్చినట్టు చెప్పారు. పట్టణాల అభివృద్ధిలో మున్సిపల్ ఉద్యోగుల సేవలు ప్రధానమైనవని అన్నారు. వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం, సమర్థవంతంగా పని చేసిన ఒకే ఒక కమిషనర్ వల్ల ఆయా పట్టణాలు బాగుపడిన సందర్భాలు అనేకం ఉన్నాయని అన్నారు. తెలంగాణ మున్సిపల్ కమిషనర్ల డైరీని ఆ శాఖ మంత్రి కెటిఆర్ శుక్రవారం సచివాలయంలో ఆవిష్కరించారు. మున్సిపల్ కమీషనర్లు, ఇతర మున్సిపల్ సిబ్బందితో ఒకటి రెండు వారాల్లో ప్రత్యేకంగా సమావేశం అవుతానని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ఈ సమావేశంలో ఉద్యోగులు తమ అనుభవంతో వివిధ సమస్యలకు పరిష్కారాలు వెతుక్కుని రావాలని, ఇప్పుడున్న పద్ధతులు, కార్యక్రమాల అమలును మరింత మెరుగ్గా చేయాలని చెప్పారు. కమీషనర్లు తాము విధులు నిర్వహిస్తున్న పట్టణాల్లో, జోన్లలో సమస్యల పరిష్కారానికి పైలట్ ప్రాజెక్టుతో ముందుకు వస్తే తామే స్వయంగా సహకారం అందిస్తామని చెప్పారు. ఆస్కితో కమిషనర్లకు ఒక రోజు శిక్షణ ఇప్పించనున్నట్టు చెప్పారు. విధి నిర్వహణలో మంత్రినని, మిగిలిన అన్ని విషయాల్లో విషయాల్లో సోదరుడిలా అండగా ఉంటానని అన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ మాదిరిగానే పట్టణ వౌలిక వసతుల కల్పన కోసం ప్రత్యేక దృష్టిసారిస్తున్నట్టు చెప్పారు. ఈసారి బడ్జెట్‌లో మున్సిపాలిటీలకు మరిన్ని నిధులు కేటాయించాలని కోరనున్నట్టు చెప్పారు. పట్టణాలకు తమిళనాడు తరహాలో ఒక సమీకృత నిధిని ఏర్పాటు చేసి, పట్టణ పరిపాలన సంస్థలకు రుణాల రూపంలో నిధులు కేటాయించే పద్ధతి కోసం ప్రయత్నం చేస్తున్నట్టు కెటిఆర్ చెప్పారు. సమావేశంలో పురపాలక శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, టిజివో నాయకులు యంఎల్‌ఎ శ్రీనివాస్ గౌడ్, మమత, ఇతర జిల్లాల నుంచి వచ్చిన మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.