తెలంగాణ

ప్రగతి నిధిగా సబ్ ప్లాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇకనుంచి అలాగే వ్యవహరిస్తాం
దళిత, గిరిజన సంక్షేమమే లక్ష్యం
సబ్ ప్లాన్‌పై అవసరమైతే చట్ట సవరణ
మిగులు నిధులు మరుసటి ఏడాదికి బదలాయింపు
ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడి
సమావేశాన్ని బహిష్కరించిన విపక్షాలు
రాజకీయం చేస్తున్నారంటూ సర్కారు మండిపాటు

హైదరాబాద్, ఫిబ్రవరి 4: ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌ను ఇకపై దళిత, గిరిజన ప్రత్యేక ప్రగతి నిధిగా వ్యవహరించనున్నట్టు ఉప ముఖ్యమంత్రి, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ఉప సంఘం చైర్మన్ కడియం శ్రీహరి వెల్లడించారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త బడ్జెట్‌లో దీనికి సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌కు ప్రాధాన్యత లేకుండా పోయందని, అందుకోసం కొత్త చట్టం తీసుకురావాలన్నారు. దేశంలో తెలంగాణ రాష్టమ్రే తొలిసారి కొత్త చట్టంపై ఆసక్తి చూపిస్తోందన్నారు. సమర్థవంతంగా చట్టాన్ని రూపొందించేందుకు తమ సలహాలతో సహకరించాల్సిన విపక్షాలు సమావేశాన్ని బహిష్కరించడం సరైన నిర్ణయం కాదన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ పేరును ఎస్సీ, ఎస్టీల ప్రత్యేక ప్రగతి నిధి పేరుతో పిలవాలని సమావేశంలో నిర్ణయించినట్టు కడియం శ్రీహరి తెలిపారు. సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టకుండా వారి కోసమే ఖర్చు చేసేలా పగడ్బందీగా చట్టం రూపొందించేందుకు ఎస్సీ, ఎస్టీ కమిటీల సంయుక్త సమావేశం శనివారం అనేక అంశాలపై చర్చించింది. గతంలో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన నిధులు ఖర్చు కాకపోతే మురిగిపోయేవని, అలాకాకుండా వచ్చే ఏడాదికి బదలాయించేలా ప్రతిపాదనలు చేసినట్టు కడియం శ్రీహరి తెలిపారు. నిధులను బాగా ఖర్చు చేసిన అధికారులకు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు, అదేవిధంగా సక్రమంగా పని చేయని వారిపై చర్యలు తీసుకునేందుకు సమావేశం సూచనలు, సలహాలు ఇచ్చిందన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం వన్ ఆఫ్ 2013 సవరణ కోసం వేసిన దళిత గిరిజన కమిటీలు సంయుక్తంగా శనివారం సర్వశిక్ష అభియాన్ సమావేశ మందిరంలో భేటీ అయ్యాయ. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, గిరిజన పర్యాటక మంత్రి చందూలాల్, దళిత సంక్షేమం, విద్యుత్ మంత్రి జగదీశ్‌రెడ్డిల ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. సమావేశానికి అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించినట్టు కడియం శ్రీహరి సమావేశం అనంతరం విలేఖరుల సమావేశంలో తెలిపారు. కమిటీల మొదటి సమావేశానికి కాంగ్రెస్ ప్రతినిధులు మాత్రమే హాజరు కాలేదని, శనివారం జరిగిన రెండో సమావేశానికి టిడిపి, కాంగ్రెస్ పార్టీలు రాలేదని, సిపిఎం ప్రతినిధి వచ్చి వెళ్లిపోయారని, ఇలా వెళ్లిపోవడం దురదృష్టకరమన్నారు. ఎస్సీ, ఎస్టీల విద్య, సామాజిక, ఆర్థిక అభివృద్ధిపై చట్టం ఎలా ఉండాలన్న దానిపై వాళ్లు హాజరై సూచనలు, సలహాలు ఇవ్వకుండా బహిష్కరిస్తామనడం బాగాలేదన్నారు. గత ప్రభుత్వాల హయాంలో 25 వేల కోట్లు దారి మళ్లాయని విమర్శించేవారు, నిధులు దుర్వినియోగం కాకుండా జాగ్రత్తలు సూచించాల్సిందిపోయ, ఉద్దేశపూర్వకంగా గైర్హాజరు కావడం ఏమని అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. విపక్షాలు సమావేశానికి హాజరై సలహాలు ఇవ్వకుండా ప్రభుత్వంపై గుడ్డి వ్యతిరేకతతో దళితుల, గిరిజనుల సంక్షేమం పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఆయా వర్గాలు, కుటుంబాలు, ఆవాసాలకు మాత్రమే ఉపయోగించేలా ఉండాలని నిర్ణయించారు. గత చట్టంలో ఏదైనా గ్రామానికి పనులు చేస్తే ఈ నిధులను దానికి ఖర్చు చేసేవారని, సాధారణ పనులు, పథకాల ద్వారా చేసే ఖర్చు ఆ గ్రామానికి ఉపయోగపడితే సంబంధిత శాఖ నిధులే వాడాలి కానీ ఎస్సీ, ఎస్టీ స్పెషల్ డెవలప్‌మెంట్ నిధులు వాడొద్దని నిర్ణయించినట్టు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ నిధులు గ్రీన్ చానల్ ద్వారా విడుదల చేసే ప్రయత్నం చేస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి రాష్ట్ర స్థాయి, నోడల్, జిల్లాస్థాయి కమిటీలు ఉన్నాయని, ఈ మూడు కమిటీల్లో ఆయా ప్రజాప్రతినిధులను పెడితే వారి వర్గాల సమస్యలు చెప్పే అవకాశం ఉంటుందన్నారు. వచ్చే బడ్జెట్‌లో రెవెన్యూ, క్యాపిటల్, వ్యయాల్లో ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ఏయే పద్దులు ఉంటాయో ఆర్థిక శాఖ అధికారులు చెబితే వాటి ప్రకారం వచ్చే సమావేశంలో చర్చిస్తామని చెప్పారు. ఫిబ్రవరి 10న మరోసారి సమావేశం అవుతామని మంత్రి చెప్పారు. గిరిజన వర్గాల మేధావులు, ఐఏఎస్, ఐపీఎస్‌లతో మాట్లాడి అనంతరం రూపొందించిన నివేదికను ముఖ్యమంత్రికి అందజేస్తామన్నారు. గతంలో ఎస్సీ, ఎస్టీల కోసం చట్టం చేసినా రూల్స్‌ను రూపొందించలేదని గుర్తు చేశారు. తొలి సమావేశంలో ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారని, రెండో సమావేశానికి వస్తామని చెప్పారని కానీ ఆయా రాజకీయ పార్టీలు మీరు సమావేశానికి వెళ్లవద్దని శాసించినట్టు తెలిసిందని కడియం తెలిపారు. సమావేశాలకు వెళ్లి ప్రభుత్వ నిర్ణయాలను సమర్ధిస్తే, చట్ట సవరణను సమర్ధిస్తే దళితుల సంక్షేమానికి టిఆర్‌ఎస్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని జనంలోకి వెళుతుందనే అడ్డుకున్నారని కడియం విమర్శించారు. ఆయా రాజకీయ పార్టీలకు దళితుల పట్ల ఎంత ప్రేమ ఉందో దీన్ని బట్టి అర్ధమవుతుందని అన్నారు.
సమావేశంలో ఎంపీలు బాల్కసుమన్, గోడం నగేశ్, సీతారం నాయక్, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్ గాదరి కిశోర్, సంజీవరావు, కోవా లక్ష్మీ, నల్లాల ఓదేలు, రెడ్యా నాయక్, తాటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీలు రాములు నాయక్, ప్రభాకర్, అధికారులు పాల్గొన్నారు.