తెలంగాణ

యాదవులకున్న అనుభవం ఐఏఎస్‌లకూ ఉండదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 5: గొర్రెలకు సంబంధించి యాదవులకు ఉన్న అనుభవం ఐఏఎస్ చదివిన వారికి కూడా ఉండదని ఆదివారం జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చమత్కరించారు.
‘‘గొర్రెలన్నీ ఒకే తీరుగ కనిపిస్తాయి. కానీ ప్రతి గొర్రెను ప్రత్యేకంగా గుర్తించే నైపుణ్యం యాదవులకుంటుంది. ఏదైనా గొర్రె అనారోగ్యంతో బాధపడితే కూడా గుర్తించి వైద్యం చేయిస్తడు. గ్రామాల్లో ఇతరులు కూడా గొర్రె పిల్లలను మేపడానికి యాదవులకు ఇస్తారు. ఈ గొర్రె పిల్లలు పెద్దయి గొర్రెలు అయినంక అది ఎవరిదో గుర్తించి వారికి అందజేస్తారు. యాదవుల అనుభవమే వారికి చదువు. అలాంటి నైపుణ్యం ఐఏఎస్ చదివిన వారికి కూడా ఉండదు’’ అని కెసిఆర్ సరదాగా చెప్పడంతో సమావేశంలో నవ్వులు పూశాయి. తెలంగాణలో గ్రామీణ ప్రాంతం ఎక్కువ. గ్రామీణ వ్యవస్థ పరిపుష్టానికి మనం ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. రిసోర్స్ మ్యాపింగ్‌లో మానవ వనరులను గుర్తించాలని అన్నారు. రాష్ట్రంలో 25లక్షల మంది యాదవులు ఉన్నారని, గొర్రెల పెంపకంలో అనుభవం, నైపుణ్యం ఉందని, వారికి ప్రత్యేక వృత్తి నైపుణ్య శిక్షణ అవసరం లేదని అన్నారు. అందుకే గొర్రెల పెంపకాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని నిర్ణయించినట్టు చెప్పారు. రాష్ట్రంలో 25లక్షల మంది గొర్రెల పెంపకం దారులు ఉన్నారని, అయినా ప్రతి రోజూ ఐదు వందల లారీల గొర్రెలు రాష్ట్రానికి దిగుమతి కావడం బాధకరమని ముఖ్యమంత్రి అన్నారు. మన రాష్టమ్రే గొర్రెలను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే స్థితికి రావాలని ముఖ్యమంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుపడాలంటే ఇలాంటివి జరగాలని అన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో గొర్రెల పెంపకం కోసం ప్రత్యేక కార్యక్రమం అమలు చేయనున్నట్టు చెప్పారు. దీని కోసం అధికారులు సిద్ధం కావాలని ముఖ్యమంత్రి సూచించారు.