తెలంగాణ

లైఫ్ సైనె్సస్ రాజధానిగా హైదరాబాద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 6: ప్రపంచ లైఫ్ సెనె్సస్, ఫార్మా రాజధానిగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దనున్నట్టు ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఫార్మా రంగానికి మొదటి నుంచీ హైదరాబాద్ కేంద్రంగా ఉందని, తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ఫార్మాసిటీ, ఈ రంగంలో హైదరాబాద్‌ను మరింత సుస్థిర స్థానానికి చేరుస్తుందన్నారు. శామీర్‌పేటలోని జినోమ్ వ్యాలీలో పర్యటించిన మంత్రి పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. 200 ఫార్మా కంపెనీలు, పదివేల మంది ఉద్యోగులతో అసియాలోనే అతిపెద్ద క్లస్టర్‌గా జినోమ్ వ్యాలీ, లైఫ్ సైనె్సస్ రంగంలో పరిశోధనలకు కేంద్రంగా ఉందని అన్నారు. ఔషధ పరిశోధనలు, ఆవిష్కరణలు, తయారీకి కావలసిన సకల సౌకర్యాలు ఇందులో ఉన్నాయని కెటిఆర్ చెప్పారు. ఫలితంగా వ్యాక్సిన్ల ఉత్పత్తిలో ప్రపంచంలోనే హైదరాబాద్ అగ్రగామిగా ఉందని గుర్తు చేశారు. నోవాటీస్, జిఎస్కే, లోన్జా వంటి దిగ్గజ కంపెనీలు తమ కార్యకలాపాలను జినోమ్ వ్యాలీలో విస్తరిస్తాయని మంత్రి తెలిపారు.
టోఫెల్‌తో కలిసి పలు కంపెనీలకు శంకుస్థాపన చేశారు. సుమారు 17వందల కోట్ల రూపాయల పెట్టుబడితో వ్యాక్సిన్ల తయారీ, పరిశోధనకు సంబంధించిన బయోలాజికల్ ఈ - సెజ్, 50వేల అడుగుల చదరపు అడుగుల ఐసిఐసిఐ ఎస్‌ఎంఈ నాలెడ్జ్ పార్క్, ఎంఎన్ పార్క్ రెండవ దశ, పరిశోధనలకు అనువైన 20లక్షల చదరపు అడుగుల రెడీ టూ అక్యూపై ని ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం సంయుక్త భాగస్వామ్యంతో దేశంలోనే మొదటిదైన నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయో మెడికల్ రిసెర్చ్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సరికొత్త సదుపాయాల కల్పనతో లైఫ్ సైనె్సస్ రంగంలో హైదరాబాద్ మరింత ముందుకు పోతుందన్న ఆశాభావాన్ని కెటిఆర్ వ్యక్తం చేశారు. వ్యాలీలో ఉన్న కంపెనీలు స్థానిక ఉద్యోగ కల్పన, అభివృద్ధికి దోహదం చేస్తున్నాయని, అందులో భాగంగానే మెడికల్ సెంటర్‌ను కూడా ఈ రోజు ప్రారంభించినట్టు కెటిఆర్ చెప్పారు. 672 కోట్ల రూపాయల పెట్టుబడులతో ముందుకు వచ్చిన ఆరు కంపెనీలకు భూ కేటాయింపు పత్రాలను అందజేశారు.
ఫార్మా బయోటెక్ పరిశ్రమలో వౌలిక వసతుల కల్పనకు వెయ్యి కోట్ల రూపాయలతో నిధిని ఏర్పాటు చేసేందుకు సెరెస్ట్రా కంపనీతో ఎంఓయు కుదుర్చుకున్నామని చెప్పారు. మొత్తంగా మూడువేల కోట్ల రూపాయల పెట్టుబడులతో జినో వ్యాలీ 2.0 కొత్త రూపం సంతరించుకుందని అన్నారు. స్వయంగా బయాలజీ స్టూడెంట్‌ను అయిన తాను ఈ రంగంలో శిక్షణ, ఉపాధి కల్పన పెంచేందుకు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. ప్రపంచంలో సాఫ్ట్‌వేర్ రంగానికి సిలికాన్ వ్యాలీ ఎలాంటిదో ఆ విధంగానే లైఫ్ సైనె్సస్‌లో జినోమ్ వ్యాలీ పేరు నిలబెడతామన్నారు. ఫార్మా రంగాభివృద్ధికి ఫార్మాసిటీ, మెడికల్ డివైజెస్ పార్క్ వంటి కొత్త ప్రాజెక్టులను కూడా తెలంగాణ ప్రభుత్వం చేపడుతుందని మంత్రి తెలిపారు. కెటిఆర్ లాంటి ముందు చూపు, ఉత్సాహం ఉన్న నాయకుడు ఉంటే ఫార్మారంగంలో తెలంగాణ మరింత అభివృద్ధి సాధిస్తుందని జాన్సన్ అండ్ జాన్సన్ చైర్మన్ ఫాల్స్ టోఫెల్ తెలిపారు. జినోమ్ వ్యాలీలో ఉన్న సౌకర్యాలు ప్రపంచ స్థాయిలో ఉన్నాయని టోఫెల్ కంపెనీల ఏర్పాటుకు ఇది అనువైన ప్రదేశమని అభినందించారు. అంతకు ముందు ఫాల్స్ టోఫెల్‌తో సమావేశమైన మంత్రి కెటిఆర్ హైదరాబాద్- ఫార్మా రంగం వివరాలు, పురోగతిపై చర్చలు జరిపారు.

చిత్రం..సోమవారం హైదరాబాద్‌లో క్యాటలిస్టు హబ్ పార్క్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి కెటిఆర్