తెలంగాణ

నరుూం కేసు సిబిఐకి అప్పగించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్, ఫిబ్రవరి 6: గ్యాంగ్‌స్టర్ నరుూముద్దీన్‌కు సంబంధించిన కేసులను సిబిఐకు అప్పగించేది లేదని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పష్టం చేశారు. సోమవారం మెదక్ వచ్చిన సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర పోలీసువ్యవస్థ పటిష్టంగా ఉందని, నేరాల అదుపులో విజయం సాధిస్తోందని అన్నారు. నరుూం కేసులను విచారించేందుకు సిట్‌ను ఏర్పాటు చేశామని, నిందితులు ఎంతటివారైనా విడిచిపెట్టేది లేదని అన్నారు. హోంగార్డులకు న్యాయం చేస్తామని, పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో వారికి అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. సమైక్యాంధ్రలో పోలీసులకు ఇచ్చిన వాహనాలు సక్రమంగా ఉండేవి కావని, 10 కిలోమీటర్లు నడిస్తే వాహనాలు ఆగిపోయి విఐపిలు కాన్వాయ్‌ని చేరుకోలేని పరిస్థితులు ఉండేవని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక పోలీస్ అధికారులకు 550 కొత్త వాహనాలు ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పోలీస్ శాఖకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్లు ఆయన తెలిపారు. లా అండ్ ఆర్డర్, మతసామరస్యత కాపాడేందుకు పోలీసులకు అత్యాధునిక వాహనాలు ఇవ్వడమే కాకుండా వారికి వౌలిక సదుపాయలు కల్పిస్తామని, దండిగా నిధులిస్తామని చెప్పడమే కాకుండా రూ. 350 కోట్లు మంజూరు చేశారని తెలిపారు.