తెలంగాణ

గూగుల్‌తో డిజిటల్ అక్షరాస్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 6: గ్రామాల్లో నగదు రహిత లావాదేవీలను పెంచే దిశగా మహిళా సంఘాలకు డిజిటల్ అక్షరాస్యత కల్పించే దిశగా పంచాయతీరాజ్ , గ్రామీణాభివృద్ధి శాఖ ప్రణాళిక రూపొందించింది. పంచాయితీరాజ్ శాఖ కార్యాలయంలో మంత్రి కృష్ణారావును గూగుల్ ప్రతినిధులు కలిశారు. మహిళా సంఘాలకు అక్షరాస్యతపై అవగాహన కల్పించే అంశాలపై చర్చించారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో తాము ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. తెలంగాణలో ప్రాథమికంగా పది జిల్లాల్లో అవగాహనా కార్యక్రమం చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు గూగుల్ ప్రతినిధి సునీత చెప్పారు.
పోస్ట్ఫాసుల్లో బయోమెట్రిక్
అన్ని పోస్ట్ఫాసుల్లో బయోమెట్రిక్, ఐరిష్ గుర్తింపు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని పోస్ట్ మాస్టర్ జనరల్ ఎలిషాను మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. ఆసరా పెన్షన్ల పంపిణీ తీరుపై పోస్ట్‌మాస్టర్ జనరల్‌తో మంత్రి చర్చించారు. బయోమెట్రిక్ ఇబ్బందులు ఉన్న పింఛనుదారులకు గ్రామ కార్యదర్శుల బయోమెట్రిక్ ద్వారా పెన్షన్ చెల్లించే విధానాన్ని వెంటనే నిలిపివేయాలని ఆదేశించారు. దీని కోసం పోస్ట్ఫాసుల్లో ఐరిష్ సౌకర్యం ఏర్పాటు చేసేందకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. పోస్ట్ఫాసులు అందుబాటులో ఉన్న గ్రామాల్లో వాటి ద్వారానే పెన్షన్ చెల్లించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇకపై ఆసరా పెన్షన్లను పూర్తి స్థాయిలో బయోమెట్రిక్, ఆసరా, ఆధార్ సీడింగ్‌తోనే చేపట్టాలని, దీనిపై బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేసి చర్చించాలని పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ నీతూప్రసాద్‌ను ఆదేశించారు.