తెలంగాణ

బిజెపి ఒత్తిడితోనే అపాయింట్‌మెంట్ రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అపాయింట్‌మెంట్ ఇస్తే రాష్ట్ర బిజెపి సూచన మేరకు రద్దు చేయటం సిగ్గు చేటని లోక్‌సభలో టిఆర్‌ఎస్ పక్షనేత జితేందర్ రెడ్డి విమర్శించారు. సోమవారం లోక్‌సభలో రాష్టప్రతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన మాట్లాడుతూ రిపబ్లిక్‌డే పరేడ్‌కు తెలంగాణ రాష్ట్ర శకటాన్ని ఆమోదించవలసిందిగా ఎంత కోరినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. ఎస్సీ వర్గీకరణపై మాట్లాడేందు కెసిఆర్ ప్రధాన మంత్రి అప్పాయింట్‌మెంట్ అడిగితే అంగీకరించిన కేంద్ర ప్రభుత్వం ఆ తరువాత రాష్ట్ర బిజెపి సూచన మేరకు రద్దు చేసుకున్నట్లు పత్రికల్లో వచ్చిందని జితేందర్ రెడ్డి చెప్పారు. ఆ వార్త తమకు ఎంతో బాధ కలిగించిందని, అందుకే ఈ పరిణామం పట్ల తమ నిరసన తెలుపుతున్నామన్నారు. కెసిఆర్ నాయకత్వంలోని టిఆర్‌ఎస్ మొదటి నుంచీ ఎన్‌డిఏ ప్రభుత్వానికి మద్దతు ఇస్తోందని, అయినా ఇలా చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
దత్తాత్రేయ ఖండన
జితేందర్ రెడ్డి ఆరోపణల్లో వాస్తవం లేదని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ స్పష్టం చేశారు. జితేందర్ మాట్లాడుతుండగా మంత్రి లేచి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణకు బిజెపి కట్టుబడి ఉన్నదని మంత్రి తెలిపారు. రాష్ట్ర బిజెపి సూచన మేరకే సిఎం కెసిఆర్‌కు ఇచ్చిన అపాయింట్‌మెంట్ ఉపసంహరించుకున్నారనేది ఎంత మాత్రం నిజం కాదని ఆయన తెలిపారు. ప్రధాని అపాయింట్‌మెంట్ రద్దు చేసుకోవాలని రాష్ట్ర బిజెపి పిఎంవోను కోరలేదన్నారు. రాష్ట్ర బిజెపి మొదటి నుంచి ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇస్తోందని దత్తాత్రేయ తెలిపారు. జితేందర్ రెడ్డి తరువాత తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా 22 జిల్లాను ఏర్పాటు చేసిందని చెప్పారు. మిషన్ భగీరథ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు సరఫరా చేసేందుకు అమలు చేస్తున్నామన్నారు. మిషన్ కాకతీయ ద్వారా 45వేల నీటిపారుదల చెరువులను ప్రభుత్వం పునరుద్ధరిస్తోందంటూ కేంద్ర ప్రభుత్వం ఈ రెండు మిషన్లకు నిధులు అందజేయాలని జితేందర్ రెడ్డి కోరారు. ఉమ్మడి హైకోర్టును వెంటనే విభజించి తెలంగాణకు ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.