తెలంగాణ

ఫేస్‌బుక్ పరిచయాలతో మోసాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 6: సామాజిక మాధ్యమం ప్రపంచ వ్యాప్తంగా ఎంత సమాచార విప్లవాన్ని తీసుకువచ్చిందో, అంతే వేగంగా యువతకు శాపంగా మారుతోంది. దీనివల్ల ఎన్ని ప్రయోజనాలున్నా.. దుష్పరిణామాలూ అంతే ఎక్కువగా సంభవిస్తున్నాయి. ఇటీవల వెలుగుచూస్తున్న కొన్ని సంఘటనలు, ఫేస్‌బుక్‌లో అపరిచిత వ్యక్తులతో ఆన్‌లైన్ స్నేహం ఎలాంటి దుష్పరిణామాలకు దారితీస్తున్నాయో వెల్లడిస్తున్నాయి. అమ్మాయిల ఫొటోలను మార్ఫింగ్ చేసి బ్లాక్‌మెయిల్ చేయడం, పెళ్లిపేరుతో వంచించడం, ఉద్యోగాల ఆశ చూపి లోబరచుకోవడం, మనీ ప్రైజ్ పేరుతో డబ్బులు కాజేయడం, వ్యాపారం పేరుతో మోసాలకు పాల్పడడం వంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి.
దీంతో బాధిత యువతీ,యువకులు తల్లిదండ్రులకు చెప్పుకోలేక లోలోపలే కుమిలిపోతూ అఘాయిత్యాలకు పాల్పడుతున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ మధ్య కాలంలోనే జంట కమిషనరేట్ల పరిధిలో 16 కేసులు నమోదయ్యాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉద్యోగాల పేరుతో మోసం చేసినట్టు నాలుగు కేసులు, పెళ్లి పేరుతో మరో నాలుగు కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో ఆన్‌లైన్ వ్యాపారం ముసుగులో ఎనిమిది కేసులు నమోదయ్యాయి. జగిత్యాలకు చెందిన ఓ సైంటిస్టు లండన్‌లోని అగ్రికల్చరల్ యూనివర్శిటీలో ఉద్యోగం ఇస్తున్నామంటూ, వీసా, ఫ్లైట్ చార్జీలు ఇతరత్రా ఖర్చుల నిమిత్తం సుమారు 6లక్షలు తీసుకుని మోసగించినట్టు సైంటిస్టు రమాదేవి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదైంది. అదేవిధంగా ఎల్‌బినగర్‌కు చెందిన శ్రీ్ధర్ అనే వ్యాపారి ఆన్‌లైన్ వ్యాపారంలో భాగస్వామిగా చేర్చుకున్నామంటూ నమ్మబలికిన నైజీరియన్‌కు రూ. 3 లక్షలు ఇచ్చి మోసపోయిన సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. మూడ్రోజుల క్రితం సోషల్‌ట్రేడ్ కంపెనీలో పెట్టుబడిన కూకట్‌పల్లికి చెందిన వాణి, హయత్‌నగర్‌కు చెందిన మాణిక్యం సహ పలువురు రాచకొండ కమిషనరేట్‌లో ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లో కూడా సోమవారం దాదాపు 28 మంది సోషల్‌ట్రేడ్ బాధితులు సిసిఎస్‌లో ఫిర్యాదు చేసినట్టు పోలీసులు తెలిపారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులతో మాట్లాడే తీరిక లేకుండా ఫేస్‌బుక్‌కే కనెక్టవుతున్నారు. పాఠశాలలకు, కళాశాలలకు వెళ్తున్నారో..లేదో..గానీ రోజూ ఫేస్‌బుక్‌ను మాత్రం అటెండ్ అవుతున్నారు. లేచింది మొదలు పడుకునే దాకా అదే ధ్యాసలో మునిగిపోతున్నారని పోలీసులు తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలను నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు హెచ్చరిస్తున్నారు.