రాష్ట్రీయం

సెక్షన్ 8పై ఆంధ్ర అసెంబ్లీ తీర్మానం హాస్యాస్పదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రజా సమస్యలపై గళం విప్పాలని చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అధ్యక్షత శుక్రవారం సమావేశమైన టిజెఎసి కోర్ కమిటీ నిర్ణయించింది. హైదరాబాద్‌లో సెక్షన్ 8 అమలు చేయాలని ఆంధ్ర అసెంబ్లీలో చంద్రబాబు చేయించిన తీర్మానం హాస్యాస్పదంగా ఉందని కోదండరామ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒక రాష్ట్రంలో మరో రాష్ట్రం పెత్తనం చెలాయించలేదని, అలా చెలాయించాలని కోరుకోవడం హాస్యాస్పదంగా ఉందని, ఇది అప్రజాస్వామికమని అన్నారు. జెఎసిగా తెలంగాణ సమస్యలపై దృష్టి సారిస్తామని, ప్రజలపై దృష్టి ఉంది తప్ప ఎవరిపై వ్యతిరేకత లేదని అన్నారు. మరోవారం రోజుల్లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు. తెలంగాణ సాకారం అయిన తరువాత టిజెఎసి మరింత బాధ్యతగా పని చేయాలని, ఏ సమస్యల వల్ల ఉద్యోగ సంఘాలు టిజెఎసి నుంచి బయటకు వెళ్లాయోనని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్టు ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు ఒక్కటే కాదని ఎన్నికల తరువాత కూడా ప్రజా సంఘాలు ప్రజల కోసం పని చేయాల్సి ఉంటుందని, తాము ఆ పనే చేస్తామని చెప్పారు. వచ్చే వారం జరిగే విస్తృత స్థాయి సమావేశంలో టిజెఎసిలో ఎన్ని సంస్థలు ఉన్నాయో తెలుస్తుందని అన్నారు.
టిజెఎసికి న్యాయవాదుల జెఎసి దూరం
తెలంగాణ న్యాయవాదుల జెఎసి టిజెఎసి కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని ఒక ప్రకటనలో తెలిపింది. తెలంగాణ సాధన కోసం పోరాడేందుకు న్యాయవాదులు న్యాయవాదుల జెఎసిని ఏర్పాటు చేశారని, తెలంగాణ సాకారం అయినందున టిజెఎసి కార్యక్రమాలకు చాలా కాలం నుంచి దూరంగా ఉంటున్నట్టు తెలిపారు. హైకోర్టు విభజన కోసం ఉద్యమిస్తామని, టిజెఎసి కార్యక్రమాలతో తమకు సంబంధం లేదని న్యాయవాదుల జెఎసి తెలిపింది.

మహారాష్ట్ర ప్రతినిధిలా మాట్లాడుతున్న హరీశ్
కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ధ్వజం
హైదరాబాద్/ ఖైరతాబాద్, మార్చి 18: మంత్రి హరీశ్ రావు మహారాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిలా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన ఇక్కడి మంత్రి హరీశ్‌రావు మహారాష్ట్ర ప్రభుత్వ వాదనను బలపరచడం విడ్డూరంగా ఉందన్నారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రయోజనాలను శాశ్వతంగా మహారాష్టక్రు తాకట్టుపెట్టే విధంగా ఇక్కడి ప్రభుత్వ వ్యవహారం ఉందని విమర్శించారు. ఎత్తు తగ్గించడం వల్ల ఎన్నో సమస్యలు ఎదురౌతాయని, 152 మీటర్ల ఎత్తులో నిర్మించడం వల్ల సుమారు 70 కిలోమీటర్ల వరకు గ్రావిటీతో నీరు ప్రవహిస్తుందన్నారు. ఎత్తు తగ్గడం వల్ల లిఫ్ట్‌లతో నీటిని తరలించాల్సిన దుస్థితి ఉంటుందన్నారు. దీని వల్ల ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం పెరగడంతో పాటు నిర్వహణ వ్యయం భారీగా పెరుగుతుందని వివరించారు. మొబలైజేషన్ పేరిట కోట్లు దండుకున్నారని విమర్శించిన హరీశ్‌రావు అప్పటి కాంట్రాక్టర్లకే పనులు ఎందుకు అప్పగిస్తున్నారని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. వారిని సస్పెండ్ చేసి కొత్తవారితో పనులు చేయించవచ్చుకదా అని సవాలు విసిరారు. మంత్రులకు దమ్ము ధైర్యం ఉంటే భద్రత లేకుండా యూనివర్శిటీలకు వెళ్లగలరా అని కాంగ్రెస్ సభ్యుడు సంపత్‌కుమార్ సవాలు విసిరారు. తెలంగాణ కోసం ఉద్యమించిన యువత, విద్యార్థులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ప్రభుత్వం ఇచ్చిన ఏ హామీని నిలబెట్టుకోక పోవడంతో వారంతా ఆగ్రహంగా ఉన్నారన్నారు.