తెలంగాణ

ఔషధ సంస్థలకు అండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 7: ప్రపంచాన్ని వణికిస్తున్న క్యాన్సర్, క్షయ, గుండె వ్యాధులను ఎదుర్కొనేందుకు ఔషధాలు తయారు చేసే సంస్ధలతో కలిసి పని చేస్తామని జాన్సన్ అండ్ జాన్సన్ చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్, ప్రపంచ ఫార్యాస్యూటికల్స్ చైర్మన్ పాల్ స్టొఫెల్స్ అన్నారు. 50 దేశాలకు చెందిన సుమారు 1500 మంది ప్రతినిధులు మంగళవారం రెండో రోజూ అనేక వ్యాధులు, ఔషధాల తయారీపై సుదీర్ఘంగా చర్చించారు. సోమవారం బయో-ఆసియా అత్యుత్తమ అవార్డును అందుకున్న పాల్ స్టొఫెల్స్ ఈ సందర్భంగా ప్రసంగిస్తూ గత ఆరేళ్ళలో తమ జాన్సన్ సంస్థ నుంచి కొత్తగా 60 ఔషధాలను మార్కెట్‌లోకి తెచ్చామని అన్నారు. క్యాన్సర్, క్షయ, గుండె వ్యాధులకు సంబంధించి ఇంకా మెరుగైన ఔషధాలు రావాల్సి ఉందని ఆయన తెలిపారు. ఇంకా ఈ సమావేశంలో స్విట్జర్లాండ్‌కు చెందిన నోవార్టిస్ సంస్ధ సిఎంవో, గ్లోబల్ హెడ్ ఆఫ్ డ్రగ్ డెవలప్‌మెంట్ డాక్టర్ వాస్ నర్సింహన్, వివిధ సంస్ధలకు చెందిన ప్రతినిధులు ప్రసంగించారు.

చిత్రం..బయో-ఆసియా సదస్సులో ప్రసంగిస్తున్న జాన్సన్ అండ్ జాన్సన్ చీఫ్ ఆపీసర్ పాల్ స్టొఫెల్స్