తెలంగాణ

సిబిసిఐడికి ‘నకిలీ చలానాల’ కుంభకోణం కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, ఫిబ్రవరి 7: నిజామాబాద్ జిల్లా బోధన్ సిటిఓ కార్యాలయం కేంద్రంగా వాణిజ్య పన్నుల శాఖలో చోటుచేసుకున్న నకిలీ చలానాల కుంభకోణం కేసును ప్రభుత్వం సిబిసిఐడికి అప్పగించాలని నిర్ణయించింది. కేవలం రెండేళ్ల వ్యవధిలోనే 65 కోట్ల రూపాయలకు పైగా పన్నును ఎగవేసినట్టు వాణిజ్య పన్నుల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ప్రాథమిక పరిశీలనలో వెల్లడి కావడంతో, మరింత సమగ్రంగా దర్యాప్తు జరిపించేందుకు వీలుగా ప్రభుత్వం ఈ కేసు బాధ్యతలను సిబిసిఐడికి అప్పగించనుంది. కేసు దర్యాప్తులో అవినీతి నిరోధక శాఖ సహకారం సైతం తీసుకునేలా సిబిసిఐడికి వెసులుబాటు కల్పించనుంది. ఈ విషయాన్ని వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ వి.అనిల్‌కుమార్ వెల్లడించారు. మంగళవారం ఆయన నిజామాబాద్‌లోని డిప్యూటీ కమిషనర్ కార్యాలయానికి చేరుకుని నకిలీ చలానాల కేసుతో ముడిపడి ఉన్న దస్త్రాలను పరిశీలించారు. ఉదయం నుండి రాత్రి వరకు పలు ఫైళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ విలేఖరులతో మాట్లాడుతూ, ప్రభుత్వానికి పన్ను చెల్లించకుండా నకిలీ ఛలానాలు సృష్టించి అక్రమాలకు పాల్పడిన వారిని ఎంతమాత్రం ఉపేక్షించబోమని అన్నారు. 2012-13, 2013-14 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి బోధన్ సర్కిల్ పరిధిలో 65 కోట్ల రూపాయల వరకు అక్రమాలు జరిగినట్టు తమ ప్రాథమిక విచారణలో వెల్లడైందని ఆయన వివరించారు. దీంతో తమ శాఖకు చెందిన ఎసిటిఓ విజయ్‌కృష్ణ, సీనియర్ అసిస్టెంట్ వేణుగోపాల స్వామి, జూనియర్ అసిస్టెంట్ హనుమాన్‌సింగ్‌లను సస్పెండ్ చేశామని, వారితో పాటు టాక్స్ కన్సల్టెంట్ శివరాజ్, అతని కుమారుడు సునీల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయించామన్నారు. నరేందర్ అనే మరో ఉద్యోగిని కూడా తొలుత సస్పెండ్ చేసినప్పటికీ, ఈ అక్రమాలలో అతని ప్రమేయం లేదని తేలడంతో సస్పెన్షన్ ఉత్తర్వులను ఉపసంహరించుకున్నామని తెలిపారు. టాక్స్ కన్సల్టెంట్ సహకారంతో నకిలీ చలానాల ద్వారా పన్ను ఎగ్గొట్టిన వారిలో ఎక్కువగా రైస్‌మిల్లర్లే ఉన్నారని కమిషనర్ పేర్కొన్నారు. మొత్తం 114 మందికి గాను 69 మంది ట్రేడర్లకు పన్ను చెల్లించాలని నోటీసులు జారీ చేశామని, 46 మంది బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశామని, సివిల్ సప్లైస్ ద్వారా జరపాల్సి ఉన్న చెల్లింపులను నిలిపివేయించామని వివరించారు. నోటీసులకు స్పందించి ముగ్గురు ట్రేడర్లు పన్ను మొత్తాలను చెల్లించేందుకు ముందుకు వచ్చారని, మిగతా వారి నుండి కూడా పన్నులు వసూలు చేసేందుకు రెవెన్యూ రికవరీ యాక్టు కింద నోటీసులు జారీ చేస్తున్నామని తెలిపారు. అప్పటికీ స్పందించని పక్షంలో ట్రేడర్ల పైనా క్రిమినల్ చర్యలకు దిగుతామని కమిషనర్ తేల్చి చెప్పారు.