రాష్ట్రీయం

సికిందరాబాద్-గౌహతి మధ్య 26 ప్రత్యేక రైళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 8: వచ్చే వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకుని సికిందరాబాద్- గౌహతి మధ్య 26 ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి తెలిపారు. ట్రైన్ నెం. 07149 సికిందరాబాద్- గౌహతి ప్రత్యేక రైలు ఏప్రిల్ 7,14,21,28 తేదీల్లో, మే 5,12,19,26 తేదీల్లో, జూన్ 2,7,23,30 తేదీల్లో ఉ.గం. 07:30లకు బయలుదేరి (శుక్రవారం) ఉ.గం. 08:45లకు (ఆదివారం) గౌహతికి చేరుకుంటుందని తెలిపారు. తిరుగు ప్రయాణంలో ట్రైన్ నెం. 07150 గౌహతి- సికిందరాబాద్ ప్రత్యేక రైలు గౌహతి నుంచి ఏప్రిల్ 10,17,24, మే 1,8,18,22,29, జూన్ 5,12,19,26, జూలై 3 తేదీల్లో ఉ.గం. 05:25లకు (సోమవారం) బయలుదేరి బుధవారం ఉ.గం. 09:15లకు సికిందరాబాద్‌కు చేరుకుంటుందని పేర్కొన్నారు. ఈ ప్రత్యేక రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామల్‌కోట్, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, బర్హంపూర్, కుర్ద రోడ్డు, భువనేశ్వర్, కటక్, భద్రక్, బాలసోర్, ఖరగ్‌పూర్, ఆందుల్, బర్దామన్, రాంపుర్హత్, మాల్దాటౌన్, కిషన్‌గంజ్, న్యూజల్పాయిగురి, జల్పాల్ గురి రోడ్డు, మయనాగురి రోడ్డు, న్యూకూచ్‌బెహర్, న్యూ అలిపుర్దార్, కొక్రాజర్, న్యూబాన్గైగావ్, గోల్‌పుర టౌన్, కామక్య స్టేషన్లలో ఆగుతాయని, ఈ ప్రత్యేక రైళ్లు ప్రత్యేక చార్జీలతో నడుస్తాయన్నారు.
ఆరు ఎక్స్‌ప్రెస్ రైళ్ల వేగం పెంపు
రైళ్ల నెంబర్లు, వేళల్లోనూ మార్పు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 8: ఆరు ఎక్స్‌ప్రెస్ రైళ్ల వేగాన్ని పెంచుతూ, రైళ్ల నెంబర్లు, వేళల్లో స్వల్ప మార్పులు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ అమోదం తెలిపిందని దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి తెలిపారు. ట్రైన్ నెం. 18309/18310 శాంబల్‌పూర్-హెచ్‌ఎస్ నాందేడ్-సంబల్‌పూర్ నాగవల్లి ఎక్స్‌ప్రెస్‌లు మే 26 నుంచి 12755 నెంబర్‌గా, హెచ్‌ఎస్- నాందేడ్-శాంబల్‌పూర్ నాగవల్లి ఎల్స్‌ప్రెస్ మే 27 నుంచి 12756 నెం బర్ గానూ మారాయని, అదేవిధంగా ట్రైన్ నెం. 18509 విశాఖపట్నం- హెచ్‌ఎస్ నాందేడ్ ఎక్స్‌ప్రెస్ మే 27 నుంచి 12753 నెంబర్‌గానూ నడుస్తుందని తెలిపారు. మే 28 నుంచి ట్రైన్ నెం 18510 హెచ్‌ఎస్ నాందేడ్-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ 12754 నెంబర్‌గా మారుతోందని తెలిపారు. ట్రైన్ నెం 18510 హెచ్‌ఎస్ నాందేడ్-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ మే 28 నుంచి కొత్త నెం బర్ 12754గా నడుస్తుందని తెలిపారు. ట్రైన్ నెం. 17249 మచిలీపట్నం- సికిందరాబాద్ ఎక్స్‌ప్రెస్ రైలు మే 25 నుంచి 12749 నెంబర్‌గానూ, ట్రైన్ నెంబర్ 17250 సికిందరాబాద్-మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ రైలు 26 మే నుంచి 12750 నెంబర్‌తో నడుస్తుందని, అదేవిధంగా రైళ్ల రాకపోకలు 10 నుంచి 20 నిముషాల వ్యవధితో మార్పులు జరిగాయని వివరించారు.
గనుల కేటాయింపు నిర్ణయం
అప్పటి మంత్రి తీసుకున్నారు
హైకోర్టుకు తెలిపిన ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 8: గనుల లీజు కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి గనుల లీజు ఖరారుపై తుది నిర్ణయం అప్పటి గనుల శాఖ మంత్రి తీసుకున్నారని హైకోర్టుకు తెలిపారు. ఈ కేసును సిబిఐ విచారిస్తోంది. దాల్మియా సిమెంట్స్‌కు మార్గదర్శకాలకు విరుద్ధంగా గనుల లీజును ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి కేటాయించారని సిబిఐ అభియోగాలు మోపింది. ఈ కేసును హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి శివశంకర రావు విచారించారు. శ్రీలక్ష్మి తరపున న్యాయవాది వై శ్రీనివాస మూర్తి వాదనలు వినిపిస్తూ తన క్లయింటు ఎటువంటి నిబంధనలను ఉల్లంఘించలేదని, మంత్రి తుది నిర్ణయం తీసుకున్నారని కోర్టుకు తెలిపారు. తనపై సిబిఐ దాఖలు చేసిన నేరాభియోగాలను కొట్టివేయాలని శ్రీలక్ష్మి హైకోర్టును కోరారు. అనంతరం ఈ కేసు విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేశారు.