ఆంధ్రప్రదేశ్‌

వైభవోపేతంగా కుంభాభిషేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాళహస్తి: భక్తజనం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన మహాకుంభాభిషేకం శ్రీకాళహస్తిలో బుధవారం వైభవోపేతంగా జరిగింది. ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం 4 గంటలకు యాగపూజ ప్రారంభమైంది. అగ్నికార్యం, పూర్ణాహుతి, నైవేద్యం, దీపారాధన కార్యక్రమాలు జరిగాయి. ఆ తరువాత యాత్రాదానం, కుంభోద్వాసన జరిగాయి. వేదపండితులు, పూజారులు యాగశాలలోని కలశాలతో ఊరేగింపుగా బయలుదేరి స్వామి, అమ్మవార్ల సన్నిధికి చేరుకున్నారు. మరికొందరు ఆలయంపైన ప్రతిష్ఠించిన కలశాల వద్దకు తీర్థజలాన్ని తీసుకెళ్లారు. 7 గంటల నుంచి ఆలయంపైన పూజారులు వేదమంత్రాలతో పూజలు నిర్వహించి కలశాలకు పవిత్ర జలాలతో అభిషేకం చేశారు. ఈ అభిషేకాన్ని చూసి భక్తజనం తరించింది.

సమన్వయ సమావేశం రసాభాస
మదనపల్లె, ఫిబ్రవరి 8 : చిత్తూరు జిల్లా మదనపల్లె నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం బుధవారం రసాభాసగా మారింది. ఒకరినొకరు దూషించుకున్నారు. ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే, మార్కెట్ చైర్మన్, సంస్థాగత ఎన్నికల ఇరువర్గాలు అసభ్య పదజాలంతో దూషణలు చేసుకోవడం గమనార్హం. సంస్థాగత ఎన్నికల ఇన్‌ఛార్జి కామకోటి ప్రసాద్‌రావు అధ్యక్షతన జరిగింది. ప్రారంభంలోనే నియోజకవర్గంలో, మండలంలో పార్టీ కోసం ఆ ఇద్దరే పనిచేస్తున్నారా, మరెవరూ పనిచేయలేదా అంటూ సుదర్శన్‌బాబు, హరినాథరెడ్డి ప్రశ్నించారు. ఇళ్లలో కూర్చొని గ్రామకమిటీలు వేయడం, పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేయడం వంటి పనులు చేశారని దుమ్మెత్తిపోశారు. ఏ సమావేశాలు జరిగినా పార్టీ కోసం పనిచేసిన మాకు, మండలంలోని టిడిపి నాయకులెవ్వరికీ సమాచారం ఇవ్వలేదని, ప్రస్తుతం జరిగిన సమావేశం కూడా తెలుసుకుని వచ్చామని తెలిపారు. ఈ సమయంలో మాజీ జడ్పీటిసి శివశంకర్ జోక్యం చేసుకుని పార్టీలు మారి తెలుగుదేశంలోకి వచ్చిన మీరా మాట్లాడేది అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వర్గానికి చెందినవారు మాత్రమే హాజరుకావడం, సీనియర్ నాయకులు రాటకొండ బాబురెడ్డి, బోడిపాటి శ్రీనివాస్, గంగారపు రామ్‌దాస్‌చౌదరి, డిఆర్ తులసి, సీడు మల్లికార్జుననాయుడు, మాజీ మార్కెట్‌కమిటీ చైర్మన్ శ్రీరామచినబాబు గైర్హాజరు కావడం కొసమెరుపు.

గుంటూరు భేటీలో దుమారం
ఆంధ్రభూమి బ్యూరో
గుంటూరు, ఫిబ్రవరి 8: గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీలో మరో దుమారం చెలరేగింది. ఇటీవల మంత్రి రావెల కిషోర్‌బాబు వ్యవహారశైలిపై కొంతకాలం క్రితం జడ్పీ చైర్‌పర్సన్ జానీమూన్ బాహాటంగా ఆరోపణలు చేసిన సంగతి విదితమే. దీనిపై పార్టీలో కలకలం చెలరేగుతోంది. ముఖ్యమంత్రి సైతం విచారణకు నియమించి నివేదిక సేకరించారు. ఈ నేపథ్యంలో తాజాగా బుధవారం అధికార పార్టీకి చెందిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి కల్తీకారం వ్యాపారులపై ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. డిజిపి నండూరి సాంబశివరావు, మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్‌బాబు ఉన్నతాధికారులతో గుంటూరు జడ్పీ సమావేశ మందిరంలో కల్తీలు, కోల్డు స్టోరేజీల నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏఎంసి చైర్మన్ మన్నవ సుబ్బారావును ఉద్దేశించి నన్నపనేని మాట్లాడుతూ కల్తీలపై ఇప్పటి వరకు చర్యలులేవు..అరెస్టులులేవు.. వ్యాపారులతో లాలూచీపడ్డారా? అని ప్రశ్నించారు. మహిళల ఆరోగ్యం దెబ్బతిన్నా ఎవరికీ పట్టటంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై చట్ట ప్రకారం క్రిమినల్ చర్యలకు ఫిర్యాదుచేశామని తెలిసీ, తెలియని విధంగా వ్యాఖ్యలు చేయటం సమంజసంకాదని ఖండించారు.