తెలంగాణ

సమాజాభివృద్ధికి దోహదం జీవవైవిధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 9: జీవ వైవిధ్యం సమాజ అభివృద్ధికి ఉపయోగపడుతుందని, మరీ ముఖ్యంగా రైతుల ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని వ్యవసాయ కమిషనర్ డాక్టర్ ఎం.జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ‘జీవవైవిధ్య చట్టం-2002, రూల్స్-2015’పై జిల్లాస్థాయి ఉద్యోగులకు అవగాహన కల్పించేందుకు హైదరాబాద్ (మలక్‌పేట)లోని ‘సమేతి’ (స్టేట్ అగ్రికల్చర్ మేనేజ్‌మెంట్ అండ్ ఎక్స్‌టెన్షన్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్)లో ప్రత్యేక సెమినార్ ఏర్పాటు చేశారు.
రైతులు కేవలం ఒకే పంటను వరుసగా వేయవద్దని, ఏటా పంటలను మారుస్తూ ఉండాలని, అలాగే ఒకే పర్యాయం అంతర పంటలను కూడా వేసేలా అధికార యంత్రాంగం చూడాలని కోరారు. వ్యవసాయ, పశుగణాభివృద్ధి, ఉద్యాన పంటలు, మత్స్య, పట్టుపరిశ్రమ తదితర విభాగాలన్నీ ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్నాయన్నారు. రైతులు ఆర్థికంగా బలపడేందుకు, ఏడాది పాటు పని ఉండేలా వ్యవసాయం, దానిపై ఆధారపడ్డ విభాగాలను చేపట్టాలన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు చెందిన ఉద్యోగులు సమన్వయంతో పనిచేయడం వల్ల రైతులకు తద్వారా సమాజానికి ఉపయోగమన్నారు.