తెలంగాణ

మంత్రి లక్ష్మారెడ్డి రాజీనామా చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 9: వైద్య ఆరోగ్య శాఖ నిర్లక్ష్యానికి నైతిక బాధ్యత వహిస్తూ ఆ శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తక్షణమే రాజీనామా చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి డిమాండ్ చేశారు. కాలం చెల్లిన, కలుషితమైన సెలైన్ బాటిల్ ఎక్కించడం వల్లే ఇటీవల గాంధీ ఆసుపత్రిలో ఒక పాప మరణించిందని అన్నారు. ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం వెనకేసుకురావడంలో ఆంతర్యం ఏమిటని ఒక ప్రకటనలో ప్రశ్నించారు. గాంధీ ఆసుపత్రిలో జరిగిన ఘటనపై శే్వతపత్రం విడుదల చేయాలని శశిధర్ రెడ్డి డిమాండ్ చేశారు. చనిపోయిన బాలిక కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు.
ప్రాజెక్టులపై చర్చకు సిద్ధమా?
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్క ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిందా? అని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావును ప్రశ్నించారు. ప్రాజెక్టులు చేపట్టడం చేతకాక ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని మంత్రి హరీశ్‌రావు నిందలు మోపుతున్నారని విమర్శించారు. గురువారం గాంధీభవన్‌లో విలేఖరుల సమావేశంలో పొన్నం మాట్లాడుతూ ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.
వైద్య సేవలపై శే్వతపత్రం విడుదల చేయండి
తెలంగాణ రాష్ట్రంలో వైద్య సేవలపై ప్రభుత్వం శే్వతపత్రం విడుదల చేయాలని మాజీ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య డిమాండ్ చేశారు. తెరాస పాలనలో వైద్యం పడకేసిందని ఆయన ఎద్దేవా చేశారు.