తెలంగాణ

జూపార్కుల అభివృద్ధికి ప్రణాళికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 9: రాష్ట్రంలో జూ పార్కుల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని జూ అండ్ పార్క్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (జపాట్) చైర్మన్, అటవీ శాఖ మంత్రి జోగు రామన్న అధికారులను ఆదేశించారు. గురువారం అరణ్య భవన్‌లో జరిగిన జపాట్ సమావేశంలో మంత్రి జోగు రామన్న పలు నిర్ణయాలు తీసుకున్నారు. జంతు ప్రదర్శన శాలల్లో ఆహ్లాదకరమైన వాతావరణం కోసం చర్యలు తీసుకోవాలని అన్నారు. జూ పార్క్ చుట్టూ హై సెక్యూరిటీ గోడ నిర్మించాలని, సర్వే చేసే బాధ్యత జెఎన్‌టియు నిపుణులకు అప్పగించాలని నిర్ణయించినట్టు చెప్పారు. సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని, సోలార్ కాంతి నిరంతరం వచ్చేలా చూడాలని అన్నారు. సెంట్రల్ జూ అథారిటీ నివేదిక ప్రకారం నెహ్రూ జూలాజికల్ పార్క్ దేశంలో మూడవ స్థానంలో ఉందని, మొదటి స్థానంలో నిలిచేందుకు కృషి చేయాలని చెప్పారు. దీని కోసం సింగపూర్‌లోని జూ పార్క్‌లను సందర్శించి అధ్యయనం చేసేందుకు మంత్రి జోగు రామన్న నేతృత్వంలో ఉన్నతాధికారుల బృందం త్వరలోనే సింగపూర్ వెళ్లనుంది. నెహ్రూ పార్క్‌లో అదనంగా రైల్వే ట్రాక్ ఏర్పాటు చేసేందుకు దక్షిణ మధ్య రైల్వే సహకారాన్ని తీసుకోవాలని, టాయ్ ట్రైన్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి చెప్పారు. జూ పార్క్‌కు ఇతర రాష్ట్రాల నుంచి మరిన్ని జంతువులను తరలించాలని చెప్పారు.

చిత్రం..హైదరాబాద్‌లో అధికారులతో సమీక్షిస్తున్న మంత్రి జోగు రామన్న