తెలంగాణ

సక్రమంగా విద్యుత్ సరఫరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 9: రబీ సీజన్‌లో వ్యవసాయానికి అవసరమైన మేరకు విద్యుత్ సరఫరా చేయాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. రబీ సీజన్‌లో 10 వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉంటుందని ఆ మేరకు సరఫరా చేయడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. రబీ సీజన్‌లో విద్యుత్ సరఫరాపై గురువారం జెన్‌కో, ట్రాన్స్‌కో సిఎండి డి ప్రభాకర్‌రావుతో ముఖ్యమంత్రి సమీక్షించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నిత్యం 8500 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉందని, వచ్చే నెలలో ఇది 9500 మెగావాట్లకు చేరుకునే అవకాశం ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నామని సిఎండి ప్రభాకర్‌రావు సిఎంకు వివరించారు. ఈసారి మంచి వర్షాలు పడటంతో పాటు మిషన్ కాకతీయ కార్యక్రమం వల్ల చెరువులలో జలకళ ఉట్టిపడుతోందని ముఖ్యమంత్రి అన్నారు. భూగర్భ జల మట్టం ఎనిమిది మీటర్ల మేర పెరిగిందని రికార్డులో రబీ సాగు అవుతుందని, పెద్ద ఎత్తున బోర్లు వినియోగిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ డిమాండ్ బాగా పెరిగిందన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ విద్యుత్ డిమాండ్ సాధారణంగా 2500-3000 మెగావాట్ల మధ్య ఉంటుందన్నారు. అయితే ఈసారి రబీ సాగు ఎక్కువ జరగడం వల్ల ఇది 4500 మెగావాట్లకు పెరిగిందన్నారు. వచ్చే నెలలో 5000 మెగావాట్లకు పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మిగతా రంగాలకు కలిపి మొత్తం విద్యుత్ డిమాండ్ 10 వేల మెగావాట్లకు చేరుకునే అవకాశం ఉందన్నారు. వ్యవసాయ రంగానికి అవసరమైన విద్యుత్‌ను అందించడంతో పాటు వేసవి కాలంలో పారిశ్రామిక, వాణిజ్య, గృహ అవసరాలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా విద్యుత్ సరఫరా చేయడానికి చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.