తెలంగాణ

ఐటి రంగంలో దివ్యాంగుల ఉపాధికి ప్రత్యేక శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 10: దివ్యాంగుల ఉపాధి కల్పన, శిక్షణ కోసం ప్రత్యేకమైన కార్యక్రమాలను రూపొందించనున్నట్టు ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు తెలిపారు. దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా పని చేస్తూ, ఉద్యోగాలు కల్పించే సంస్థలకు ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తామని అన్నారు. వరంగల్ లాంటి ద్వితీయ శ్రేణి నగరాలు, జిల్లా కేంద్రాల్లో దివ్యాంగులకు శిక్షణ ఇచ్చి, ఉపాధి కల్పిస్తే పలు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. దివ్యాంగులకు అందరితో పాటు సమాన అవకాశాలు కల్పిస్తే చాలు అన్నారు. దివ్యాంగులకు శిక్షణ ఇచ్చి పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా తయారు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఉద్యోగాలకు సిద్ధంగా తయారు చేస్తే దివ్యాంగులను ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు ఐటి కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే చాలా రంగాల్లో పాలసీలు, పథకాల్లో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని, ఇప్పుడు దివ్యాంగుల ఉపాధి కోసం సైతం ప్రత్యేకమైన విధానాలు రూపొందిస్తామని చెప్పారు. టాస్క్ ద్వారా దివ్యాంగుల శిక్షణ కోసం టాస్క్ ద్వారా పలు కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. దివ్యాంగులకు మాత్రమే పెద్ద పీట వేస్తూ ఉద్యోగాలు కల్పించే వింద్యా ఈ- ఇన్ఫో మీడియా కాల్ సెంటర్‌ను బేగంపేటలో మంత్రి శుక్రవారం ప్రారంభించారు. బెంగళూరులో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థ హైదరాబాద్‌కు విస్తరించింది. దివ్యాంగుల కోసం గత దశాబ్ద కాలంగా పని చేస్తున్న ఆశోక్ గిరి దంపతులను మంత్రి అభినందించారు. సంస్థ విస్తరణకు అవసరం అయిన సహకారాన్ని అందిస్తామని అన్నారు.