తెలంగాణ

ఫీల్డ్ అసిస్టెంట్ మృతదేహంతో ఎమ్మెల్యే ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 10: ఫీల్డ్ అసిస్టెం ట్ మృతికి అధికారులే కారణమని ఆరోపిస్తూ మృతుడి బంధువులతో పాటు ఏకంగా మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ధర్నాకు దిగారు. దీంతో శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మహబూబ్‌నగర్ మండలం ధర్మాపూర్ గ్రామానికి చెందిన రామచంద్రయ్య (47) అనే ఫీల్డ్ అసిస్టెంట్ గురువారం ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు అధికారులే కారణమంటూ డ్వామా కార్యాలయం ఎదుట మృతుడి బంధువులు ధర్నాకు దిగడంతో ధర్మాపూర్ గ్రామానికి వచ్చి కుటుంబాన్ని ఆదుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. దీంతో మృత దేహా న్ని కుటుంబసభ్యులు ఇంటికి తీసుకెళ్లారు. తీరా అధికారులు శుక్రవారం ఉదయం 10గం టలు దాటినా రాకపోవడంతో ఆగ్రహించిన బంధువు లు, కుటుంబసభ్యులు మృతదేహాన్ని నేరుగా మహబూబ్‌నగర్ కలెక్టర్ కార్యాలయానికి తీసుకువచ్చి ధర్నాకు దిగారు. ఈ విషయం తెలిసిన ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్ని కార్యక్రమాలు పక్కన పెట్టి కలెక్టరేట్‌కు చేరుకున్నారు. వివరాలు తెలుసుకున్న అనంతరం మృతుడి బంధువులతో కలిసి కలెక్టరేట్‌లో మృతదేహాన్ని పెట్టి ధర్నాకు దిగారు. ఉదయం 11గంటలకు చేపట్టిన ధర్నా సాయంత్రం 6గంటల వరకు సాగింది. కలెక్టర్ వచ్చి సమస్యను పరిష్కరించాలని, మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఉన్నతాధికారులకు ఎమ్మెల్యే సమాచారం ఇచ్చారు. అయితే సాయంత్రం జాయింట్ కలెక్టర్ శివకుమార్‌నాయుడు వచ్చి కలెక్టర్ సెలవులో ఉన్నారని తానే ఇంచార్జినని తెలిపారు. మృత దేహాన్ని అక్కడి నుండి తరలించాలని పోలీసుల కు సూచించారు.
మృతుడి కుటుంబాన్ని ఆదుకోకుండా మృత దేహాన్ని తీసేది లేదని జెసితో వాగ్వాదానికి దిగా రు. వెంటనే జెసి తన చాంబర్‌లోకి వెళ్లిపోయారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌తో జెసి చర్చలు జరిపి మృతుడి కుటుంబాన్ని ఆదుకునేందుకు డ్వామా పిడి దామోదర్‌రెడ్డితో చర్చించారు. చర్చల తర్వాత సాయంత్రం 6.30గంటల ప్రాంతంలో మృతుడి భార్యపిల్లల తో జెసి, ఎమ్మెల్యే మాట్లాడి ఇద్దరు ఆడపిల్లల కు డిఆర్ డిఏలో కంప్యూటర్ ఆపరేటర్లుగా ఉద్యోగాలు కల్పిస్తామని, అదేవిధంగా రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా, డబుల్‌బెడ్‌రూం సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇవ్వడంతో ఎమ్మెల్యే శాంతించి కుటుంబసభ్యులను, గ్రామస్థులను ఒప్పించారు. తరువాత మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం ధర్మపూర్‌కు తరలించారు.

చిత్రం..మహబూబ్‌నగర్ కలెక్టరేట్‌లో ఫీల్డ్ అసిస్టెంట్ రామచంద్రయ్య మృతదేహాన్ని ఉంచి ధర్నా చేస్తున్న స్థానిక తెరాస ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్