తెలంగాణ

ఏడేళ్ల బాలుడికి కాలేయ మార్పిడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 10: అరుదైన కాలేయ వ్యాధి ‘విల్సన్ డిసీజ్’తో బాధపడుతున్న ఏడేళ్ల బాలుడికి కాలేయ మార్పిడి చికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లు అపోలో హాస్పిటల్ వైద్యులు వెల్లడించారు. జన్యుపరమైన వ్యాధి గా గుర్తించి మృత్యువుతో పోరాడుతున్న బాలుడు టి.సిద్ధార్థ రెడ్డికి చికిత్స చేశామని వైద్యులు తెలిపారు. పీడియాట్రిక్ హెపటాలజిస్ట్ డాక్టర్ రమేశ్ శ్రీనివాసన్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసి డిసెంబర్ చివరలో కామెర్లు సోకినట్లు గుర్తించారు. అనంతరం కాలేయం పూర్తిగా వైఫల్యం చెందిందని గుర్తించారని అపో లో హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. రోగి తల్లికి చెందిన కాలేయం నుంచి ఒక ముక్కను సేకరించి అన్ని వ్యతిరేక పరిస్థితులకు ఎదురొడ్డి బాలుడి కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స చేసినట్లు అపోలో చీఫ్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డాక్టర్ మనీశ్ వర్మ తెలిపారు. శస్తచ్రికిత్స విజయవంతమై, తగిన మందులు ఇవ్వడం ద్వారా కోలుకుని బాలుడు క్షేమంగా ఉండడంతో హాస్పిటల్ నుంచి పంపించివేసినట్లు తెలిపారు.