తెలంగాణ

59 జీవోలో సవరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 10: ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని నిర్మించిన భవనాల క్రమబద్ధీకరణకు ఉద్దేశించిన జీవో 59ను సవరిస్తూ రెవిన్యూ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 500 చదరపు గజాల వరకు క్రమబద్ధీకరణకు ఉన్న అవకాశాన్ని 1000 చదరపు గజాల వరకు సవరిస్తూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎజి గోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని భవనాల నిర్మాణాల విస్తీర్ణం ఆధారంగా ప్రభుత్వానికి ఫీజు చెల్లించి క్రమబద్ధీకరించుకోవడానికి జీవో 59ను 2015 జనవరి 31న జారీ చేసింది. 250 చదరపు గజాల వరకు ఒక కేటగిరి, 250 నుంచి 500 చదరపు గజాల వరకు మరో కేటగిరి, 500 చదరపు గజాలు దాటిన వాటిగా మూడు కేటగిరీలను వేర్వేరుగా ఖరారు చేసి వీటికి రిజిస్ట్రేషన్ విలువపై 25, 50, 75 శాతంగా చెల్లింపుల ద్వారా క్రమబద్ధీకరణకు ఫీజులు ఖరారు చేసింది. అయితే ఈ జీవో 500 చదరపు గజాల వరకు ఉన్న అవకాశాన్ని 1000 చదరపు గజాల వరకు పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 1000 చదరపు గజాల వరకు ఆక్రమించుకున్న వారికి క్రమబద్ధీకరించుకునేందుకు అవకాశం ఏర్పడింది. దీని వల్ల మరి కొంత మందికి లబ్ధి చేకూరడమే కాకుండా ప్రభుత్వానికి ఆదాయం సమకూరనుంది.