తెలంగాణ

స్వయంసమృద్ధి దిశగా రైతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 11: తెలంగాణ రాష్ట్రంలో రైతులను స్వయం సమృద్ధి వైపు నడిపిస్తున్నామని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ (జీడిమెట్ల)లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ (సిఓఇ)లో ‘పోర్టబుల్ సోలార్ మైక్రో కోల్డ్‌రూం’ను శనివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ, సేద్యంలో రైతులకు మంచి ఆదాయం వచ్చేలా చూస్తున్నామని, బ్యాంకుల నుండి రుణాలు అవసరం లేదన్న నిర్ణయానికి రైతులంతా రావాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమని వివరించారు. పంటల ఉత్పత్తులు అధికంగా మార్కెట్లోకి రాగానే దళారులు సదరు పంటల ఉత్పత్తుల ధరలను తగ్గించివేస్తున్నారని, దాంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఈ పరిస్థితిలో పంటల ఉత్పత్తులను కొంత కాలంపాటు నిలువ చేసుకునేందుకు పోర్టబుల్ కోల్డ్‌స్టోరేజీలు ఉపయోగపడతాయన్నారు. పోర్టబుల్ సోలార్ మైక్రో కోల్డ్ రూంలను రైతులు ఏర్పాటు చేసుకునేందుకు సబ్సిడీ అంశంపై ముఖ్యమంత్రితో చర్చిస్తానని మంత్రి తెలిపారు. పోర్టబుల్ సోలార్ మైక్రో కోల్డ్‌రూంలను ‘రేయా సోలార్ కంపెనీ’ రూపొందించింది. ఈకోఫ్రాస్ట్ బ్రాండ్ పేరుతో విడుదలైన మొదటి యూనిట్‌ను నిజామాబాద్ జిల్లాకు చెందిన పాలీహౌజ్ రైతు నవీన్‌కు మంత్రి ఈ సందర్భంగా అందించారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్, ఉద్యాన కమిషనర్ ఎల్.వెంకట్రామిరెడ్డి, అధికారులు, రైతులు పాల్గొన్నారు.రాష్ట్రంలో 7.17 లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలు పండుతున్నాయని, వీటిని అవసరమైతే నిలువ చేసేందుకు శీతల గిడ్డంగులు అవసరమని పోచారం అన్నారు. పాలీహౌజ్‌ల నిర్మాణంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటిస్థానంలో ఉందన్నారు. గత రెండేళ్లలోనే వెయ్యి ఎకరాలకు పాలీహౌజ్ విధానంలో సేద్యానికి చేయూత ఇచ్చామన్నారు. పాలీహౌజ్‌లకోసం దేశంలో ఏ రాష్ట్రప్రభుత్వం ఇవ్వనంత సబ్సిడీని (75 శాతం) తెలంగాణ ఇస్తోందని గుర్తు చేశారు.

చిత్రం..హైదరాబాద్‌లో శనివారం ‘పోర్టబుల్ సోలార్ మైక్రో కోల్డ్‌స్టోరేజ్’ను ప్రారంభిస్తున్న మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి